Vikram: హీరో విక్రమ్‌కు తీవ్ర గాయాలు.. ఆస్పత్రిలో చికిత్స.. ఇప్పటికే 23 సర్జరీలు!
తనదైన నటనా కౌశల్యంతో ఆద్యంతం ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు చియాన్ విక్రమ్. విభిన్నమైన కథలతో, పాత్రలతో తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రయోగాలు చేయడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. పేరుకు కోలీవుడ్ హీరో అయినప్పటికీ దాదాపు అన్ని భాషల్లో ఆయనకు అభిమానులు ఉన్నారు. వివిధ రాష్టాల్లోనూ మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ పోతున్నారు విక్రమ్. అయితే ఇలా డిఫరెంట్ చిత్రాలు చేస్తూ ప్రమాదాల బారిన విక్రమ్‌కు మరోసారి యాక్సిడెంట్ జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే..
శంకర్ సినిమాతో: చియాన్ విక్రమ్‌కు తెలుగులో కూడా భారీ అభిమానులు ఉన్నారు. ఇక్కడ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. సినీ కెరీర్ మొదట్లో తెలుగు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు పోషించిన విక్రమ్ శివ పుత్రుడు సినిమాతో స్టార్ యాక్టర్ గా ఎదిగారు. ఇక సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన అపరిచితుడు చిత్రంతో విక్రమ్ స్టార్‌డమ్ అమాంతం పెరిగిపోయింది.

పాజిటివ్ టాక్: గతేడాది పొన్నియన్ సెల్వన్ సినిమాతో అలరించిన విక్రమ్ ఈ ఏడాది పొన్నియన్ సెల్వన్ 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా పార్ట్ 2 ఏప్రిల్ 28న విడుదలై పాజిటివ్ టాక్ అందుకుంది. అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతోంది.

రిహార్సల్స్ సమయంలో: పొన్నియన్ సెల్వన్ ప్రమోషన్స్ లో తనకు 23 సర్జరీలు జరిగనట్లుగా చెప్పొకొచ్చిన విక్రమ్ మరోసారి ప్రమాదం బారిన పడ్డారు. పొన్నియన్ సెల్వన్ 2 హిట్ కావడం, దాని ప్రమోషన్స్ కూడా ముగియడంతో తంగళన్ మూవీ చిత్రీకరణలో పాల్గొన్నారు విక్రమ్. డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన రిహార్సల్స్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విక్రమ్ పై నుంచి కింద పడ్డారని సమాచారం.

చికిత్స.. విశ్రాంతి: తంగళన్ చిత్రం షూటింగ్ లో పై నుంచి కింద పడిన విక్రమ్‌కు తన పక్కటెముకలు విరిగాయని తెలుస్తోంది. ప్రమాదం జరగ్గానే ఆయన్ను హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం విక్రమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. అయితే ఇప్పటికే 23 సర్జరీలు అయిన విక్రమ్ కు మరో సర్జరీ చేస్తారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పీరియాడికల్ డ్రామాగా: ఇదిలా ఉంటే తంగళన్ సినిమా కోసం విక్రమ్ గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. ఏప్రిల్ 17న విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన మేకింగ్ వీడియోలో డస్టీ లుక్ లో ఏ సినిమాలో చేయని రీతిలో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు. 1800ల కాలంలో జరిగే పీరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తోంది. విక్రమ్ కు 61వ చిత్రంగా వస్తున్న దీన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











