Don't Miss!
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్!
- News చంద్రబాబు బచ్చా కామెంట్ కు జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇలా...!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
రక్తంతో తడిచిన చేతితో గన్ అందిస్తూ.. పిచ్చెక్కిస్తున్న విక్రమ్, ధ్రువ్ మూవీ ఫస్ట్‌లుక్
తమిళ సూపర్‌స్టార్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ గతేడాది అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్య వర్మతో తమిళ సినీ రంగం ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. తన రెండో చిత్రంలో ఏకంగా తన తండ్రి విక్రమ్‌తో ధ్రువ్ జతకట్టబోతున్నారు. వీరిద్దరు కలిసి నటిస్తున్న చియాన్60 (వర్కింగ్ టైటిల్) చిత్రానికి సెన్సేషనల్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా గురించి తెలియజేస్తూ సోషల్ మీడియాలో విడుదల చేసిన పోస్టర్ సినిమాపై ఆసక్తిని రేపుతున్నది. ఇంతకు ఈ సినిమా కథ కమామిషు ఏమిటంటే..
చియాన్60 ఫస్ట్ లుక్ పోస్టర్
తన రెండో సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను ధ్రువ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. తాజా షేర్ చేసిన పోస్టర్ ప్రకారం.. ఓ వ్యక్తి రక్తంలో తడిచిన చేతితో ఓ యువకుడికి గన్ ఇస్తుండటం కనిపించింది. దీంతో క్రైమ్ థ్రిల్లర్ అయి ఉంటుందనేది ప్రాథమికంగా స్పష్టమైంది.
ధ్రువ్ ఇన్సాటాగ్రామ్ పోస్టులో
ఇక తన చిత్రం గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడిస్తూ.. నాకు కార్తీక్ సుబ్బరాజ్ సినిమాలు అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలు ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను. ఇక అనిరుధ్ మ్యూజిక్ గురించి చెప్పనక్కర్లేదు. ఆయన పాటలు లూప్‌లో పెట్టుకొని వింటాను. ఇక మా నాన్నకు నేను బిగ్ ఫ్యాన్‌ను. ఇలా నాకు ఇష్టమైన ముగ్గురితో కలిసి ఓ సినిమాలో నటించడం నా కల సాకరమైనట్లే.. ఇక గొప్ప ఫీలింగ్‌ను ఆస్వాదిస్తున్నాను. మీరెవరూ నన్ను డిస్ట్రబ్ చేయవద్దు అంటూ తన పోస్టులో పేర్కొన్నారు.
కార్తీక్ సుబ్బరాజు గురించి
దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కెరీర్ విషయానికి వస్తే.. గతేడాది రజనీకాంత్‌తో కలిసి పేటా చిత్రాన్ని రూపొందించారు. తాజాగా విక్రమ్, ధ్రువ్‌తో రూపొందించే సినిమాకు అనిరుధ్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా పెట్టుకొన్నారు. ఇంకా సాంకేతిక నిపుణుల వివరాలు అధికారికంగా త్వరలో ప్రకటించనున్నారు.
విక్రమ్ సినిమాల వివరాలు
ఇక విక్రమ్ సినిమాల విషయానికి వస్తే.. క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, హీరోయిన్లు శ్రీనిధి శెట్టి, మియా జార్జ్‌తో కలిసి కోబ్రా చిత్రంలో నటిస్తున్నారు. సూపర్ నేచురల్ థ్రిలర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి ఆర్ అజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉండగా.. గౌతమ్ వాసుదేవన్ మీనన్‌తో కలిసి ధ్రువ నక్షత్రం చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో రితూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లు, వినాయకన్, సిమ్రాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానున్నది.