600 సినిమాల్లో నటించిన ప్రముఖ నటి కన్నుమూత.. మృతికి కారణం ఏమిటంటే?
దక్షిణాదిలో ప్రముఖ నటి శకుంతల అలియాస్ సీఐడీ శకుంతల ఇకలేరు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం (సెప్టెంబర్ 17వ తేదీ) రాత్రి బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 84 సంవత్సరాలు. ఆరు దశాబ్దాలకుపైగా ఆమె నటన రంగంలో రాణిస్తున్నారు. శకుంతల మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. ఆమె మృతి నేపథ్యంలో సంతాపం వ్యక్తం చేస్తూ ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొంటున్నారు. శకుంతల జీవితానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
శకుంతల డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించారు. 1960 సంవత్సరంలో ఖైదీ కన్నైరామ్ చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత కాయ్ కొడుతా దైవం, థావపుధానవన్, సినిమా పైతియామ్ లాంటి చిత్రాల్లో నటించారు. 1970 దశకంలో తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ చిత్ర రంగాల్లో పాపులారిటీని సాధించారు.

తమిళ సినిమా రంగంలో 1970 సంవత్సరంలో సీఐడీ శంకర్ అనే చిత్రంలో సీఐడీ పాత్రలో నటించి విశేషంగా ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకొన్నది. అప్పటి నుంచి ఆమె సీఐడీని తన పేరు పక్కన చేర్చుకొని సీఐడీ శకుంతలగా మారిపోయింది.
శకుంతల నటించిన చివరి సినిమా పొన్‌మానై థేడీ. 1998 సంవత్సరంలో చివరి మూవీలో నటించారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత టెలివిజన్ సీరియల్స్‌లో నటిస్తూ తన నటనను కొనసాగించారు. తమిళంలో ప్రముఖ టెలివిజన్ ఛానెల్స్‌లో ప్రసారమైన కస్తూరి, తమిళ్ సెల్వి సీరియల్స్ నటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ రంగంలో శకుంతల కెరీర్ కొనసాగింది. దాదాపు 600 చిత్రాల్లో నటించి మెప్పించారు. దాదాపు 9 సీరియల్స్‌లో నటించారు.
అయితే శకుంతల కొద్దికాలంగా వృద్దాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆమె కన్నుమూశారు. దాంతో ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.


Click it and Unblock the Notifications











