చైన్నై లో సినీ రచయితల సదస్సు
దివంగత ముఖ్యమంత్రి, సినిమా స్క్రిప్ట్ రచయిత సిఎన్ అన్నాదురై శత జయంతిని పురస్కరించుకుని శనివారం నగరంలో ప్రత్యేక కార్యక్రమా న్ని నిర్వహించనున్నట్టు తమిళ సినీ రచయితల సంఘం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. తమిళ సినీ రచయితల సంఘం తరపున కార్యదర్శి విసి గుహనాథన్ ఈ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం సినీ రచయితలకు పరిశ్రమలో సరైన గుర్తింపులేదని ఆయన ప్రకటనలో తెలిపారు.
కొన్ని దశాబ్దాల క్రితం సినీ పరిశ్రమ రచయితలను గౌరవించేదనీ, రచయితలకు గుర్తింపు, గౌరవం ఉండేదనీ గుహనాధన్ అభిప్రాయపడ్డారు. 21 తేదీ జరిగే కార్యక్రమంలో అన్నా పేరుతో ఏర్పాటయ్యే అవార్డును ప్రముఖ రచయితకు అందజేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో తమిళ సినీ ప్రముఖులు పలువురు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమాన్ని మాజీ మంత్రి ఆర్‌ఎం వీరప్పన్ ప్రారంభించి, అన్నా చిత్రపటాన్ని ఆవిష్కరిస్తారు. 2010లో అఖిలభారతసినీ రచయితల సదస్సు నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయ న తన ప్రకటనలో తెలిపారు.


Click it and Unblock the Notifications











