'చేరన్' ని ఛీ కొట్టిన 'ప్రియమణి'!

"కొందరు తాము చాలా తెలివైన వాళ్ళమనుకుంటారు. నిజానికి చేరన్ నన్ను డైరక్ట్ గా డేట్స్ అడగలేదు. ఆయన ఆఫీసులో వారు ఆ పని చేసారు. అయినా నేను ఇప్పటికే మూడు సినిమాలు ఒప్పుకున్నాను. అయినా వాళ్ళు ఘోరంగా రెండు రోజులు మాత్రమే టైమ్ ఇచ్చారు. అప్పటకీ నేను అపాలిజీ చెప్పుకుని సారీ ...కష్టం అన్నాను. దాన్ని ఆయన వేరే విధంగా అర్ధం చేసుకుంటే నేనేం చెయ్యను."
"అయినా నాకు అవార్డు రావటంలో ఆయనకు అసూయ ఉంది. ఆయన దర్శకత్వంలో చేసిన వారికే అవి రావాలనేది ఆయన భావనఅయ్యుంటుంది. అయినా ఎదుటి వారు ఎదుగుతూంటే కొందరు ఓర్చుకోలేరు. నేను తెలుగులో 'ద్రోణ', మళయాళంలో 'Thirakatha' సినిమాలో చేస్తున్నాను. ఈ లోగా మణిరత్నం సార్ నుంచి ఏ క్షణమైనా కాల్ రావచ్చని ఎదురుచూస్తున్నా. అని మొత్తం కక్కేసింది. ఈ సన్నివేశం చూసిన వారు ప్రియమణిది రియల్ గా 'పరుత్తి వీరన్' లోని ముత్తళగి పాత్రే అని మెచ్చుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











