తెలుగు రీమేకు లు అక్కడ
తమిళంలో హిట్టయిన సినిమాలను క్రేజీ రేటుకు కొని తెచ్చి తెలుగులో కి రీమేక్ చేయటం మన వాళ్ళు ఎంతో కాలంగా క్రమం తప్పకుండా ఆచరిస్తున్న సాంప్రదాయం.దాన్ని బ్రేక్ చేస్తూ తెలుగు లోంచి రెండు సినిమాలు తమిళం లోకి వెళ్ళి అరవ కుర్రాళ్ళను అలరిస్తూండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.అవి సిధ్ధార్ధ,జెనీలియా జంటగా భాస్కర్ రూపొందించిన 'బొమ్మరిల్లు' ,వెంకటేష్,త్రిషా జంటగా రాఘవన్ దర్శకత్వం వహించిన 'ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే '.బొమ్మరిల్లు తమిళంలో జయం రవి,జెనీలియా కాంబినేషన్ లో 'సంతోష్ సుబ్రమణ్యం' పేరుతోనూ,ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే చిత్రాన్ని ధనుష్,నయనతార హీరో హీరోయిన్లుగా 'యారాది నీ మోహిని' పేరుతో రీమేక్ చేసారు.దాంతో మన వాళ్ళు మహా సంతోషంలో ఉన్నారట.బాగానే ఉంది గాని భాస్కర్,రాఘవన్ ఇద్దరూ తమిళులే కావటం గుర్తు పెట్టుకోవాలి అంటున్నారు సీనియర్లు. రెండు సినిమాలు తమిళ ఉగాది రోజున రిలీజవుతాయి.


Click it and Unblock the Notifications











