Cobra First Look: ఏడు అవతారాలతో విక్రమ్ విశ్వరూపం.. ఇర్ఫాన్ పఠాన్ కూడా..

సూపర్‌స్టార్ కమల్ హాసన్ తర్వాత అంతటి విలక్షణ నటుడు ఎవరంటే తడుముకోకుండా చెప్పే పేరు చియాన్ విక్రమ్. అపరిచితుడు, జెమిని, సేతు, పితామగన్ లాంటి చిత్రాల్లో ఆయన నటన ప్రేక్షకులనే కాదు.. సినీ విమర్శకులను మెప్పించింది. ప్రతీ సినిమాలోనూ ఓ డిఫెరెంట్ లుక్‌తో కనిపించే విక్రమ్ తాజాగా ఏడు గెటప్‌తో అదరగొట్టేశారు. తాజాగా రిలీజైన కోబ్రా చిత్రం ఫస్ట్‌లుక్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఏడు గెటప్స్ గురించి మరింత వివరంగా..

కోబ్రా ఫస్ట్‌లుక్‌తో విక్రమ్

కోబ్రా ఫస్ట్‌లుక్‌తో విక్రమ్


కోబ్రా మూవీ ఫస్ట్‌లుక్‌తో విక్రమ్ మరోసారి తన విశ్వరూపం చూపించారు. మ్యాజిక్ అద్దం ముందు ఫోజిచ్చి.. ఏడు అవతరాలను ప్రదర్శించారు. ఏ ఒక్కదానికి కూడా పోలీక లేకుండా ప్రతీ గెటప్ చాలా వినూత్నంగా డిజైన్ చేయడం చూస్తే కథలో సీరియస్, ఇంటెన్సిటీ స్పష్టంగా అర్ధమవుతున్నది. విక్రమ్ కెరీర్‌లో కోబ్రా మరో వినూత్న చిత్రంగానే కాకుండా ఓ ప్రయోగాత్మకంగా మారే అవకాశం కనిపిస్తున్నది.

ఇప్పటి వరకు కనిపించని విధంగా

ఇప్పటి వరకు కనిపించని విధంగా

ఇక వెయిటింగ్ ముగిసిపోయింది. అభిమానుల కోసం కోబ్రా ఫస్ట్‌లుక్ రిలీజ్ చేస్తున్నాం. ఏడు అవతారాల్లో చియాన్ విక్రమ్ ఆకట్టుకొంటాడని భావిస్తున్నాం. ఇప్పటి వరకు వెండితెర మీద కనిపించని అవతారాలతో విక్రమ్ ఆలరించబోతున్నారు అంటూ కోబ్రా ఫస్ట్‌లుక్‌ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.

ఇర్ఫాన్ పఠాన్ సినిమాల్లోకి

ఇర్ఫాన్ పఠాన్ సినిమాల్లోకి

అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రం ఇప్పటికే పలు విశేషాలతో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతున్నది. ఈ సినిమా ద్వారా ఇర్ఫాన్ పఠాన్ సినీ రంగంలోకి ప్రవేశిస్తున్నారు. స్పై థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం నవంబర్ 2019 నుంచి శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. రష్యా, కోల్‌కతా లాంటి ప్రదేశాల్లో షూటింగ్ జరుపుకొన్నది.

కేజీఎఫ్ భామ రొమాన్స్

కేజీఎఫ్ భామ రొమాన్స్


కోబ్రా చిత్రంలో విక్రమ్ సరసన కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో తీజయ్, ఆనంద్ రాజ్, మృణాళిని రవి, కేఎస్ రవికుమార్, బాబు ఆంటోని, పద్మప్రియ, మమ్ముకొయా, ఇర్ఫాన్ పఠాన్, తదితరులు నటిస్తున్నారు. ఏఆర్ రెహ్మన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ బ్యానర్‌పై లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X