ఇద్దరు బ్యూటీ హీరోయిన్స్ కోల్డ్ వార్ కి కారణం ఈగో’...!?
హీరోయిన్లు ఇద్దరుంటే ఆ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌లో ఇబ్బందులు ఎదురవుతాయని గతంలో అనేకసార్లు మనం విన్నాం. అదే పద్ధతిలో ఇప్పుడు జెనీలియా, హన్సిక ఇద్దరు హీరోయిన్లు ఒకే చిత్రంలో నటిస్తూ నిర్మాత, దర్శకులను నానా ఇబ్బందిపాలు చేసారని కోలీవుడ్లో వినికిడి. కోలీవుడ్‌లో నిర్మిస్తున్న 'వేలాయుధం" చిత్రానికి సంబంధించిన షూటింగ్‌లో ఇద్దరు హీరోయిన్లకు ఒకేసారి కాల్ షీట్స్ ఉంటే ఆరోజు యూనిట్ లో సందడే సందడి. జెనీలియా వచ్చి హన్సికకు ఎన్ని షాట్స్ ఉన్నాయి, ఎన్ని డ్రెస్సులు వేస్తున్నారు? ఎన్ని పాటలు ఉంటున్నాయి? అని ఆరా తీస్తోందిట. అదే విధంగా హన్సిక కూడా జెనీలియాపై పూర్తి వివరాలు కావాలని అడుగుతోంది. వీరిద్దరి దెబ్బకు తట్టుకోలేక దర్శకుడు ఇద్దరికి విడివిడిగా షూటింగ్ ఏర్పాటు చేశాడని సమాచారం.
తమిళ హీరో విజయ్ హీరోగా రూపొందిన 'వేలాయుధం" చిత్రంలో జెనీలియా, హన్సిక ముఖ్య పాత్రలు పోషించారు. సినిమా షూటింగ్ సమయంలో ఈ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ విషయాన్ని జెనీలియా దగ్గర అడిగితే 'నా రేంజ్ వేరు. ఎవ్వరితోనూ నాకు గొడవలు లేవు" అని చెప్పిందట. కానీ నా రేంజ్ వేరు అని చెప్పడంలోనే హన్పికను చులకనగా మాట్లాడిందని అర్థం చేసుకోవచ్చు. జెనీలియా ఇలా మాట్లాడటం పట్ల హన్సిక చాలా ఆగ్రహంగా ఉందని, జెనీలియా లాగా తను కూడా ఓ రేంజ్ హీరోయినే అన్న విషయం జెనీలియా గుర్తు పెట్టుకోవాలని హన్పిక తన సన్నిహితుల దగ్గర చెబుతోందని కోలీవుడ్ లో టాక్..


Click it and Unblock the Notifications











