త్రిషతో కోల్డ్ వార్ నిజమే...నయనతార
త్రిషకు, నయనతారకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని నయనతార మీడియా వద్ద ఒప్పుకుంది. ఈ విషయమై మాట్లాడుతూ...సినిమా పరిశ్రమలో వదంతులు కామన్. వాటిని పట్టించుకోవడం మానేశాను. కాకపోతే స్నేహంగా ఉంటూనే హాని చేసేవాళ్లని చూసినప్పుడు బాధ కలుగుతుంది. త్రిషకీ, నాకూ మధ్య అలానే జరిగింది. త్రిష నాకు స్నేహితురాలు కాదు..అలాగని శత్రువూ కాదు. ఇతర స్నేహితులతో కలిసి మేం అడపా దడపా పార్టీల్లో పాల్గొనేవాళ్లం. బాగానే మాట్లాడుకునేవాళ్లం. కానీ మా వెనకాల వార్తలు సృష్టించి మా మధ్య మనస్పర్థలు నెలకొనడానికి కొంతమంది కారకులయ్యారు. మేమిద్దరం వాటిని సరిచేసుకోవాలనుకున్నాం కానీ కుదరలేదు. అందుకని 'కోల్డ్ వార్' కొనసాగుతోంది అంటూ క్లారిఫై చేసింది. అలాగే ప్రభుదేవా గురించి మాట్లాడుతూ...ఈ మధ్యకాలంలో ప్రభుదేవాతో మీకు ఉన్న సంబంధం గురించి చెప్పండని అడగడాలు ఎక్కువైంది. అతనితో నా అనుబంధం గురించి మొత్తం ప్రపంచమంతా చెప్పాల్సిన అవసరం లేదు. మా మధ్య మంచి అనుబంధం ఉంది. ఆ విషయాన్ని కాదనను. ప్రభుదేవా మంచి నటుడు. జెంటిల్‌మాన్ అని సర్టిఫై చేసింది.


Click it and Unblock the Notifications











