ఆమె..కలర్స్.. ఇక తమిళంలో...

By Staff

Colors Swathi
టి.వి పోగ్రామ్ 'కలర్స్' తో పాపులర్ అయిన స్వాతి సినిమావారికి తెగ నచ్చేసింది. దాంతో కృష్ణవంశి యూత్ థ్రిల్లర్ అంటూ చేసిన 'డేంజర్' లో అవకాశం పట్టేసింది. కాని పాపం ఫిలిం క్లిక్ కాకపోవటంతో పాప కూడా కిక్కురమనకుండా తర్వాత ఛాన్సెస్ కోసం చూసింది. అప్పుడు డి.డి.ఎల్.జె. కి మరో మోడ్రన్ వెర్షన్ అయిన 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే' చిత్రం లో మందిరాబేడీ పాత్రకి ఆ వయసు అల్లరి పిల్ల అవసరమొచ్చింది. అంతే స్వాతి కి మళ్లీ లక్ తిరిగింది. తాజాగా 'అష్టా చెమ్మా' అనే ఇంద్రకంటి మోహన్ కృష్ణ సినిమాలో చేసింది. తర్వాత ఏమిటా అని చూస్తుంటే చిత్రంగా ఒక తమిళ చిత్రంలో హీరోయిన్ గా ఆఫర్ వచ్చింది. ఆ సినిమా పేరు 'సుబ్రమణ్యపురం'. శశికుమార్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.

వాస్తవ సంఘటనలతో ముడిపడిన ఈ కథ 'సుబ్రమణ్యపురం' అనే మధురై వద్ద వున్న గ్రామం నేపద్యంలో జరుగుతుందిట. 1980 తొలినాళ్లలో అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ జీవితాల్లో జరిగిన నిజ జీవిత సంఘటనలతో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాలో 'చెన్నై 28' ఫేమ్ జయ్ హీరో. స్వాతి అతని సరసన నటించింది. దర్శకుడు శశికుమార్‌తో పాటు గంజా కరుప్పు, సముద్రకని ఇతర పాత్రలు పోషించారు. ఇంతకీ ఆమెకీ ఆఫర్ ఎలా వచ్చిందంటే 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే' సినిమాని చేస్తున్నప్పుడు తమిళ దర్శకుడు కావటంతో ఆ యూనిట్ వాళ్ళలో చాలా మంది తమిళ వాళ్ళే. వాళ్ళలో కొంత మందికి ఈమె కలుపుగోలుతనం,చిలిపితనం పిచ్చ పిచ్చగా నచ్చేసి ఈ దర్శకుడుకి రికెమండ్ చేసారట. మరి ఈ సినిమా గనుక హిట్టయితే స్వాతి తమిళంలో సెటిలవుతుంది. అప్పుడు మన వాళ్ళూ ఆమె డేట్స్ కోసం పరుగెడతారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X