twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీకాంత్ ఫ్యాన్స్ ఆగ్రహం... ఆ సీన్ తొలగించిన నిర్మాతలు!

    |

    జయం రవి, కాజల్ అగర్వాల్ జంటగా తమిళంలో రూపొందుతున్న కామెడీ చిత్రం 'కోమలి'. ఆగస్టు 15న ఈ మూవీ విడుదల కాబోతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఇటీవల ట్రైలర్ విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ ట్రైలర్‌పై రజనీకాంత్ అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు.

    ఈ చిత్రంలో జయం రవి 16 సంవత్సరాల పాటు కోమాలో ఉండి బయటకు వచ్చిన వ్యక్తిగా కనిపించబోతున్నారు. అతడు స్పృహలోకి రాగానే టీవీలో రజనీకాంత్ 'నేను తప్పకుండా రాజకీయాల్లోకి వస్తాను' అని చెప్పడం కనిపిస్తుంది. ఇది ఏ సంవత్సరం అని అడగ్గా పక్కనే ఉన్న యోగి బాబు ఇది 2016 అని చెబుతాడు. దీనికి జయం రవి రియాక్ట్ అవుతూ నాకు అబద్దం చెప్పి నన్ను ఫూల్ చేస్తున్నావా? ఇది 1996 అంటూవ్యాఖ్యానిస్తారు. 1996లో కూడా రజనీకాంత్ రాజకీయాల్లో వస్తాను అని చెప్పారు అనేది ఈ సీన్ వెనక పరమార్థం.

    Comali movie producers decided to remove Rajinikanth scene

    రజనీకాంత్ చాలా ఏళ్ల నుంచి రాజకీయాల్లోకి వస్తున్నా అంటున్నారు.... అనే అంశాన్ని సెటైరిక్‌గా చూపించే ప్రయత్నం చేయడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సోషల్ మీడియాలో తమ ప్రతాపం చూపించారు. దీనిపై దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ దిగిరాక తప్పలేదు.

    'నేను రజనీ సర్‌కు పెద్ద అభిమానిని, ఆయన్ను పొలిటికల్ లీడర్‌గా చూడాలనుకునే వారిలో నేనూ ఒకరిని, రజనీ సర్‌ను కించ పరచాలనే ఉద్దేశ్యం మాకు ఏ మాత్రం లేదు, ఆయన రాజకీయాల్లోకి రావాని మేము కూడా కోరుకుంటున్నాం' అని స్పష్టం చేశారు. సినిమా నుంచి ఆ సీన్ తీసేయాలని దర్శక నిర్మాతలు డిసైడ్ అయ్యారట.

    English summary
    Comali movie producers decided to remove Rajinikanth scene. Comali is an upcoming situation comedy drama film produced by Vels Film International. Also known by it’s working title during production as JR24, the film is written and directed by Pradeep Ranganathan in his directorial debut and stars Jayam Ravi, Kajal Aggarwal and Samyuktha Hegde in the lead roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X