ప్రముఖ హస్యనటుడి ఇంట్లో చోరి.. భారీ మొత్తంలో బంగారం అపహరణ
తమిళ హాస్యనటుడు ఇమ్మాన్ అన్నాచ్చికి చేదు అనుభవం ఎదురైంది. వేసవి సెలవుల నేపథ్యంలో కుటుంబంతో విహారయాత్రకు వెళ్లగా కమెడియన్ ఇంటికి దొంగలు కన్నం వేశారు. బుధవారం తన ఇంటికి వచ్చి చూడగా దొంగలు విలువైన వస్తువులు దోచుకు వెళ్లినట్టు గుర్తించారు. దాంతో ఆయన చెన్నైలోని అరుంబాక్కం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే

విదేశాలకు వెళ్లితే.. ఇంట్లో చోరి
కొద్దిరోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లాను. అలరించారు. చెన్నైలోని అరుంబాక్కం రాజీవ్‌గాంధీ వీధిలోని తన ఇంటికి తిరిగి వచ్చి చూడగా ఇంట్లోని బీరువాను పగులకొట్టి నగలు, కొంత నగదు దోచుకెళ్లారు అని ఇమ్మాన్ అన్నాచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దొంగల ఆచూకీ తెలుసుకొనేందుకు విచారణ చేపట్టారు

భారీగా బంగారు అభరణాల అపహరణ
పోలీసుల ప్రాథమిక విచారణలో మొత్తం 41.5 సవర్ల బంగారం చోరీకి గురైందని గుర్తించారు. పక్కాగా బీరువాలో తాళం వేసిన వస్తువులు పోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇదంతా తెలిసిన వారే పని అని పోలీసులు, కమెడియన్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాను ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్ము పోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కుట్టీ చుట్టీస్ ద్వారా ప్రజాదరణ
తమిళ ఛానెల్‌లో ప్రసారమైన కామెడీ రియాలిటీ షో కుట్టీ చుట్టీస్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత వేటైకారన్, మారియాన్, పులి, కాకిచుట్ట, సామి స్క్వేర్ సినిమాలతో ప్రజాదరణ పొందారు. ఆయన నటించిన సినిమాలు పోదు నాలన్ కారుది, నేత్ర సినిమాలు రిలీజ్‌కు ఉన్నాయి.

కమెడియన్‌కు పోలీసుల భరోసా
ఇమ్మాన్ అన్నాచ్చి ఇంట్లో దొంగలు పడి విలువైన సొమ్మును దోచుకపోవడంతో ఆయన సన్నిహితులు వ్యక్తిగతంగానూ, ఫోన్‌లో పరామర్శించినట్టు తెలిసింది. త్వరలోనే నిందితుల ఆచూకీ గుర్తిస్తామని, చోరీకి గురైన వస్తువులను రికవరీ చేసి తిరిగి అందజేస్తామని పోలీసులు భరోసా ఇచ్చినట్టు తెలిసింది. చెన్నైలో ఇటీవల మరో కమెడియన్ ఇంట్లో కూడా దొంగలు పడటం చర్చానీయాంశమైంది. సెలబ్రిటీ ఇళ్లకే భద్రత లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.


Click it and Unblock the Notifications











