స్టార్ కమిడియన్ పై దర్శకుడు పోలీసులకు ఫిర్యాదు

By Srikanya

K. Bhagyaraj-Santhanam
చెన్నై: ప్రముఖ తమిల దర్శకుడు,రచయిత, నిర్మాత భాగ్యరాజా.. తాజాగా తన కథను చౌర్యం చేసారంటూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. తన కథను తమిళ హాస్య నటుడు సంతానం రైట్స్ తీసుకోకుండా వాడుకుని సినిమా తీసారని ఆయన ఆ కంప్లైంట్ లో ప్రాస్తావించారు. త్వరలో విడుద కాబోతున్న 'కన్నా లడ్డు తిన్న ఆశయా' చిత్రం కథపై ఈ వివాదం మొదలైంది.

వివరాల్లోకి వెళితే... హాస్య నటుడు సంతానం ప్రధాన పాత్రలో నటించిన 'కన్నా లడ్డు తిన్న ఆశయా' చిత్ర కథ తనదంటూ దర్శక నటుడు భాగ్యరాజ్‌ పోలీసు కమిషనర్‌ను ఆశ్రయించాడు. సంతానంతో పాటు పవర్‌స్టార్‌ శ్రీనివాసన్‌ తదితరు నటించిన ఈ చిత్రాన్ని సంతానం, రామనారయణన్‌ సంయుక్తంగా నిర్మించారు. సంతానం ఈ విషయమై బాగ్యరాజాని సంప్రదించి విషయం సెటిల్ చేసుకుని విడుదల చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే భాగ్యరాజ్‌ సోమవారం కమిషనర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంటూ.. 1981లో తాను రచించిన కథతో తెరకెక్కిన చిత్రం 'ఇండ్రుపోయ్‌ నాలై వా' అని, ఇందులో తనతో సహా ముగ్గురు హీరోలు ఒక హీరోయిన్‌ వెంటపడటం కథ అని, ఈ కథ హక్కులను తనకు ఇవ్వాల్సిందిగా నిర్మాత రామ నారాయణన్‌ కథను కోరినా తాను అంగీకరించలేదని అన్నారు. అందుకు కారణం తన కుమారుడు హీరోగా తెలుగు, తమిళంలో ఆ చిత్రాన్ని రీమేక్‌ చేయాలనుకోవటమే అన్నారు.

అయితే రామనారాయణన్‌ తన కథ ఆధారంగానే కన్నా లడ్డు తిన్న ఆశయా చిత్రాన్ని నిర్మించారని కనుక రామనారాయణన్‌పై చర్యలు తీసుకోవాలని భాగ్యరాజ్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. త్వరలోనే 'కన్నా లడ్డు తిన్న ఆశయా' విడుదల అవుతోంది. ఈ చిత్రం ఇప్పటికే బిజినెస్ సర్కిల్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X