ఆ దర్శకుడి సోదరితో కమెడియన్ పెళ్లి.. హాజరైన సినీ ప్రముఖులు
హీరో, అతని పక్కన ఓ కమెడియన్ అదొక హిట్ ఫార్మూలా. అందుకనే సూపర్ స్టార్ రేంజ్ ఉన్న హీరో అయినా.. అప్పుడప్పుడే ఎదుగుతున్న హీరోలకైనా సినిమాలో ఓ కమెడియన్ సపోర్ట్ ఉంటుంది. అలా తెలుగు నాట బ్రహ్మానందం అన్ని తరాల హీరోలను కవర్ చేశాడు. తమిళ నాట ఆ రికార్డు వడివేలు సొంతం చేసుకోగా.. తమిళ నాట యువ కమెడియన్ల జోరుగా కొనసాగుతోంది. సంతానం, సతీష్, సూరి, యోగి బాబు లాంటి హాస్య నటులు స్టార్ స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఓ స్టార్ కమెడియన్ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా హల్ చల్ చేస్తున్నాయి.

యువ హీరోల స్నేహితుడు..
కత్తి, రెమో, నవ మన్మథుడు, లాంటి సినిమాల్లో హాస్య నటుడిగా నటించి మంచి గుర్తింపును తెచ్చకున్నాడు. సతీష్‌కు ఎక్కువగా యువ హీరోల సినిమాల్లో స్నేహితుడి పాత్రకు ఎంచుకుంటారు దర్శకనిర్మాతలు.

దర్శకుడి సోదరితో వివాహం..
కోలీవుడ్ దర్శకుడు చాచి సోదరి సింధును సతీస్ వివాహం చేసుకున్నాడు. రీసెంట్‌గా జరిగిన రిసెప్షన్ వేడుకకు కోలీవుడ్ ప్రముఖులు హాజరై.. నూతన దంపతులను ఆశీర్వాదించారు.
అలా ఒకటయ్యారు..
ఆరేళ్ల నుంచి దర్శకుచు చాచికి, సతీష్‌కి స్నేహబంధం ఉండగా.. తన సోదరి సింధును అతనికి ఇచ్చి చేయడానికి ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో.. వీరిద్దరి వివాహం అంగరంగవైభవంగా జరిగింది.
మెరిసిన విజయ్ సేతుపతి, శివ కార్తీకేయన్..
కేవలం సినిమాల్లోనే కాకుండా తెర వెనుక కూడా స్నేహితుడిగా వ్యవహరించే సతీష్‌కు యువ హీరోల్లో ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వీరిలో విజయ్ సేతుపతి, శివ కార్తీకేయన్, ఉదయ నిధి స్టాలిన్, జీవాలాంటి వారు ముఖ్యమైనవారు. వీరంతా సతీష్ రిసెప్షన్ వేడుకలో మెరిసారు.


Click it and Unblock the Notifications











