twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2.70 కోట్ల చీటింగ్.. ఐదేళ్లుగా మోసం.. హీరో విశాల్‌పై కమెడియన్ పోలీస్ కేసు!

    |

    తమిళ హీరో విష్ణు విశాల్‌తోపాటు ఆయన తండ్రి భూవివాదంలో కూరుకుపోయారు. భూమి అమ్మకం విషయంలో తనను ఆర్థికంగా మోసగించారంటూ కమెడియన్ సూరి చెన్నైలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును ఆధారంగా చేసుకొని పోలీసులు విశాల్ తండ్రి రమేష్ కుడవ్లా, ఫైనాన్సియర్‌ అంబువేల్ రాజన్‌పై కేసు నమోదు చేశారు. ఈ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

     భూమి కొనుగోలు కోసం 2.70 కోట్లు

    భూమి కొనుగోలు కోసం 2.70 కోట్లు

    భూమి కొనుగోలు కోసం రమేస్ కుడవ్లా, అంబువేల్ రాజన్‌కు కమెడియన్ సూరి రూ.2.70 కోట్ల మేర చెల్లించాను. ఆ తర్వాత భూమి తన పేర రిజిస్టర్ చేయకపోవడంతో డబ్బు వాపస్ చేయమని పలుమార్లు కోరాను. అయితే అటు భూమి అప్పగించకపోగా, డబ్బు చెల్లించకపోవడంతో పోలీసులను ఆశ్రయించానని సూరి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

     భూమి కొనుగోలు కోసం 2.70 కోట్లు

    భూమి కొనుగోలు కోసం 2.70 కోట్లు

    భూమి కొనుగోలు కోసం రమేస్ కుడవ్లా, అంబువేల్ రాజన్‌కు కమెడియన్ సూరి రూ.2.70 కోట్ల మేర చెల్లించాను. ఆ తర్వాత భూమి తన పేర రిజిస్టర్ చేయకపోవడంతో డబ్బు వాపస్ చేయమని పలుమార్లు కోరాను. అయితే అటు భూమి అప్పగించకపోగా, డబ్బు చెల్లించకపోవడంతో పోలీసులను ఆశ్రయించానని సూరి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

     ఐదేళ్లుగా డబ్బు తిరిగి ఇవ్వకుండా

    ఐదేళ్లుగా డబ్బు తిరిగి ఇవ్వకుండా

    గత ఐదేళ్లుగా భూవివాదం కొనసాగుతున్నది. ఐదు సంవత్సరాలుగా పలు రకాలుగా వారితో సంప్రదింపులు జరిపాను. మధ్య వర్తులు కూడా మా వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించారు. కానీ ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాను. అంతేకాకుండా వీర ధీర సూరన్ సినిమాకు సంబంధించిన రెమ్యునరేషన్ కూడా ఇవ్వడం లేదు అని కమెడియన్ సూరి మీడియాకు వెల్లడించారు.

    విశాల్ తండ్రి, ఫైనాన్సియర్‌పై కేసు నమోదు

    విశాల్ తండ్రి, ఫైనాన్సియర్‌పై కేసు నమోదు

    కమెడియన్ సూరి ఫిర్యాదు చేసింది నిజమే. ఆయన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఫైన్సాన్సియర్ అంబువేల్ రాజన్, నటుడు విష్ణు విశాల్ తండ్రి, మాజీ పోలీస్ అధికారి రమేష్‌పై కేసు నమోదు చేశాం. వారిపై ఐపీసీ ప్రకారం ఐదు సెక్షన్లను నమోదు చేశాం అని అడయార్ పోలీసులు తెలిపారు.

    Recommended Video

    Hero Vishal Press Meet విశాల్‌ ప్రెస్ మీట్
    తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విష్ణు విశాల్

    తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విష్ణు విశాల్

    కమెడియన్ సూరి ఆరోపణలు, పోలీసు ఫిర్యాదుపై విష్ణు విశాల్ స్పందించారు. ట్విట్టర్ ద్వారా ఓ ప్రకటనను విడుదల చేశారు. తనపై, తన తండ్రిపై తప్పుడు ఆరోపణలు చేయడం బాధకరం. స్వార్థ ప్రయోజనాల కోసం తమపై బురద జల్లుతున్నారు. వకరిమాన్ పరంబరై సినిమాకు చెల్లించిన రెమ్యునరేషన్ తిరిగి ఇవ్వకుండా మమల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఆ సినిమా ఆగిపోవడంతో మాకు తిరిగి ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇవ్వడం లేదు అని విష్ణు విశాల్‌ తన ప్రకటనలో తెలిపారు.

    English summary
    Comedian Soori files police complaint on Hero Vishnu Vishal, his father Ramesh Kudawal and anbuvel Rajan over land issues. He mentioned in his complaint that, Ramesh and Abuvel duped him for an amount of Rs 2.70 crore in the pretext of a land sale.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X