స్టార్ కమేడియన్ వడివేలు రాజకీయాల్లోకి!?
ప్రముఖ తమిళ హాస్య నటుడు వడివేలు రాజకీయాల్లోకి రాబోతున్నట్టు కోలీవుడ్ సమాచారం. వడివేలు ఇల్లు, ఆఫీసు పై ఇటీవల కొంతమంది దాడి చేశారు. అయితే దీని వెనుక వియజ్ కాంత్ ఉన్నాడని ఆయన ఆరోపించారు కూడా. వీటిన్నింటినీ ఎరుర్కోవాలంటే రాజకీయమైన అండదండలు ఉండాలని వడివేలు కోరుకున్నట్టు కోలీవుడ్ సమాచారం. అధికార డిఎంకె పార్టీలో ఆయన చేరబోతున్నట్టు వినికిడి.
తనపై జరిగిన దాడి గురించి మాట్లాడుతూ 'ఇదంతా అతను కావాలని చేసిందే. తెలియక జరిగింది కాదు. గతంలో విజయ్‌కాంత్ హీరోగా నటించిన చిత్రాల్లో విజయ్ కాంత్ భావి ముఖ్యమంత్రిగా డైలాగులు మాట్లాడాలని సూచించినట్టు చెప్పారు. అయితే ఇది ఇతర పార్టీల వారికి తప్పుడు సంకేతాలు పంపినట్టవుతుందని దానికి తాను అంగీకరించలేదని చెప్పారు. అందుకే విజయ్‌కాంత్ తనపై కక్షకట్టి ఇలా దాడులు చేయించారు. నా ఇల్లు, ఆఫీస్ పై జరిగిన దాడిలో విజయ్ కాంత్ అనుచరులే ఉన్నారు. నన్ను, నా కుటుంబాన్ని తుదముట్టించమని వారిని నాపైకి పంపాడు. విజయ్ కాంత్ తమిళనాడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర ప్రజల్ని ఆ దేవుడే కాపాడాలి. అతన్ని అభిమానించే వారికన్నా నన్ను అభిమానించే వారు ఎక్కువన్న సంగతి తెలుసుకోవాలి అని అన్నారు.


Click it and Unblock the Notifications











