twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్ కమిడియన్ కు పోలీసులు స్ట్రాంగ్ గా క్లాస్

    By Srikanya
    |

    చెన్నై : సినిమాల్లో తరచూ ట్రాఫిక్ పోలీసులను బురిడీ కొట్టించే హాస్యనటుడు వివేక్‌కు రియల్ లైఫ్‌లో పోలీసులు ఝలక్ ఇచ్చారు. నల్ల అద్దాలున్న కారుతో పట్టుబడినందుకు రూ.100 జరిమానా వసూలు చేసి పంపించేశారు. నగర శివారు ప్రాంతం సెయింట్ థామస్‌మౌంట్ ట్రాఫిక్ సహాయ ఇన్‌స్పెక్టర్ కొడిసెల్వన్ నేతృత్వంలో ట్రాఫిక్ పోలీసులు మంగళవారం వాహనాల తనీఖీలను చేపట్టారు. అద్దాలకు నల్ల స్టిక్కరు అంటించిన వాహనాలను తనిఖీ చేయడంతో పాటు, బస్సుల ఫుట్‌బోర్డులపై ప్రయాణించే వారిని అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ ఇచ్చారు.

    ఈ క్రమంలో చెన్నై విమానాశ్రయం నుంచి వెలుపలికి వస్తున్న కారును పోలీసులు ఆపి బ్లాక్ ఫిల్మ్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. సదరు కారులో నుంచి కిందకి దిగిన హాస్యనటుడు వివేక్ తనదైన శైలిలో ట్రాఫిక్ పోలీసులతో మాటామంతీ కలిపి బురిడీ కొట్టేందుకు యత్నించారు. బ్లాక్‌ఫిల్మ్‌తో ప్రయాణించేందుకు తనకు అనుమతి వుందని, ఇందుకు గాను అధికారులు మంజూరు చేసిన ధృవీకరణపత్రాలు వున్నాయంటూ బుకాయించారు.

    సదరు ధృవీకరణ పత్రాలను చూపించాల్సిందిగా పోలీసులు అడగడంతో ఖంగుతిన్న వివేక్ బిక్కమొహం వేశారు. దీంతో పోలీసులు ఆయనకు రూ.100 జరిమానా విధించారు. డ్రైవర్ ఆ మొత్తాన్ని చెల్లించడంతో వివేక్ అక్కడ నుంచి వెళ్లిపోయారు. అనంతరం పోలీసులు తిరిగి కార్ల తనిఖీ కొనసాగించారు. ఈ తనికీలలో పలువురు ప్రముఖల కార్లకున్న నల్లరంగు స్టిక్కర్లను తొలగించినట్టు పోలీసులు ప్రకటించారు.

    English summary
    Popular comedian Vivek recently ran into the long arm of the law while driving around the suburbs of Chennai. The actor’s car was pulled over by the traffic police on duty as the vehicle had breached the recently imposed ban on sunfilms and tinted windows in cars. The diligent cops, even after knowing that the highly affable comedian was in the car, decided to abide by their code and fine the actor for the violation. It is believed that Vivek too duly paid the fine and assured to remove the sunfilm from his car at the earliest.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X