Tamilnadu 2026 Elections: ‘TVK గెలవడం ఖాయం.. విజయ్ సీఎం కావడం తథ్యం’

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ అట్టహాసంగా జరుగుతున్నది. ఈ దఫా సినీ ఇండస్ట్రీ నుంచి దళపతి విజయ్ కొత్త పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి రావడం ఆసక్తికరమైన పరిణామంగా నెలకొన్నది. దాంతో డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలతోపాటు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ కూడా బరిలో ఉండటం వల్ల ముక్కోణపు పోటీ నెలకొన్నది. తమిళనాడు వ్యాప్తంగా జరుగుతున్న ఓటింగ్‌‌లో భాగంగా చెన్నైలో సినీ ప్రముఖులు తమ ఓటు హక్కను ఉపయోగించుకొన్నారు.

ధనుష్, శివకార్తీకేయన దంపతులు, మణిరత్నం దంపతులు, రజనీకాంత్, త్రిషా తదితరులు తమ ఓటు హక్కను ఉపయోగించుకొన్నారు. ఈ సందర్భంగా ఓటు హక్కు ఉపయోగించుకొన్న కమెడియన్, నటుడు వీటీవీ గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రముఖ వార్త సంస్థ ఏఎన్ఐ (ANI)కి ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

VTV Ganesh prediction of Vijay s Win

నేను ఓటు హక్కును ఉపయోగించుకొన్నాను. నేను దళపతి విజయ్ ప్రారంభించిన టీవీకే పార్టీకి ఓటు వేశాను. సొసైటీని అప్‌గ్రేడ్ చేయడానికి విజయ్ పర్‌ఫెక్ట్ ఫిట్ అని నేను విశ్వసిస్తున్నాను. సిస్టమ్, ప్రజలకు మంచి చేస్తారని బలంగా నమ్ముతున్నాను. నాకు ఇతర పార్టీల గురించి మాట్లాడటం ఇష్టం లేదు. ఎందుకంటే నేను టీవీకే పార్టీకి చెందిన వాడిని కాబట్టి ఆ పార్టీ గురించే మాట్లాడుతాను. టీవీకే పార్టీ గెలువాలని కోరుకొంటున్నాను. విజయ్ సీఎ కావాలని కోరుకొనే వారిలో ముందుటాను అని వీటీవీ గణేష్ అన్నారు.

టీవీక పార్టీ గెలుస్తునడంలో ఎలాంటి అనుమానాలు వద్దు. కచ్చితంగా విజయ్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. నిన్నటి వరకు విజయ్ పార్టీ గెలుస్తుందా? లేదా? అనే కొంత గందరగోళం ఉంది. ఓటింగ్ సరళిని చూస్తే ఈ రోజు మాత్రం విజయ్ పార్టీ విజయం సాధించడం ఖాయమని తేలిపోయింది. మే 4వ తేదీ వరకు వేచి ఉండండి. టీవీకే పార్టీ గెలుస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు అని వీటీవీ గణేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఓటు హక్కు ఉపయోగించుకోవాలలని యువ ఓటర్లకు పిలుపునిచ్చారు. యంగ్ ఓటర్లు ఇది మీ భవిష్యత్. ఇంట్లో కూర్చోకుండా దయచేసి వచ్చి ఓటు హక్కు ఉపయోగించుకొండి. మీ జీవితానికి ఓటు హక్కు చాలా ముఖ్యమైనది. రాబోయే తరాలకు మీ ఓటు మంచి చేస్తుంది. కాబట్టి ఓటు హక్కును తప్పకుండా ఉపయోగించుకొండి అంటూ ఆయన పిలుపునిచ్చారు.

Read more about: vtv ganesh tvk vijay
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X