తండ్రి అయిన స్టార్ కమెడియన్.. అలాంటి నిరాశ నుంచి ఆనందంలోకి...
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రేక్షకులను తనదైన హాస్యంతో ఆకట్టుకొంటున్న కమెడియన్ యోగిబాబు దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. తమ కుటుంబంలోకి వారసుడు అడుగుపెట్టడంతో వారి ఆనందం ఆకాశాన్ని అంటుతున్నది. తాజాగా తన పుత్సోత్సాహాన్ని యోగి బాబు సోషల్ మీడియా ద్వారా పంచుకొన్నారు. తన కుమారుడి జననం గురించి తెలియజేస్తూ..

లాక్‌డౌన్‌కు ముందు యోగిబాబు పెళ్లి
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ కమెడియన్‌గా పాపులారిటీ సాధించిన యోగిబాబు వివాహం లాక్‌డౌన్‌కు కొద్ది రోజుల ముందు అంటే ఫిబ్రవరి 5వ తేదీన మంజు భార్గవితో జరిగింది. కేవలం కొద్ది మంది సన్నిహితుల, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు.

గ్రాండ్‌గా రిసెప్షన్‌కు ప్లాన్.. కానీ
అయితే తన పెళ్లి సందర్భంగా భారీగా అతిథులను పిలిచి రిసెప్షన్ నిర్వహించాలనుకొన్నారు. తమిళనాడు సీఎం నుంచి కోలీవుడ్ స్టార్ హీరోలను ఆహ్వానించారు. కానీ ఆ సమయంలో లాక్‌డౌన్ విధించడంతో కాస్త నిరాశ చెందారు. తన పెళ్లికి కోసం సిద్ధం చేసిన వస్తువులను పేదలకు స్వయంగా పంచి లాక్‌డౌన్ బాధితులను ఆదుకొన్నారు.

తల్లి, బిడ్డ క్షేమంగా అంటూ..
ఇక లాక్‌డౌన్‌లో దాంపత్య జీవితాన్ని ఆస్వాదించారు. డిసెంబర్ 28న భార్య మగబిడ్డకు జన్మనివ్వడం గురించి తన అభిమానులతో పంచుకొన్నారు. నా భార్య మంజు భార్గవి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారు. తండ్రిగా ఈ క్షణాలను ఆస్వాదిస్తున్నాను. అద్బుతమైన ఫీలింగ్‌తో ఆనందంలో మునిగిపోయాను అంటూ యోగిబాబు తన సంతోషాన్ని పంచుకొన్నారు. కమెడియన్ మనోబాలాతోపాటు పలువురు సినీ ప్రముఖులు యోగిబాబుకు కంగ్రాట్స్ చెప్పారు.
Recommended Video

యోగిబాబు కెరీర్ గురించి
ఇప్పటికే పలు విజయవంతమైన చిత్రాలతోపాటు స్టార్ హీరోల యోగిబాబు పక్కన నటించారు. 2021లో ఆయన నటించిన పలు చిత్రాలు రిలీజ్‌కు సిద్దంగా ఉన్నాయి. డిక్కిలోనా, కడైసీ వివసాయి, పీ మామా, సెలూన్ చిత్రాలు రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. హీరోగా నటించిన చిత్రం కూడా రిలీజ్‌కు రెడీ అవుతున్నది.


Click it and Unblock the Notifications











