రజినీకాంత్ శివాజీతో కంపేర్ చేస్తే ఎంధిరన్ సూపర్: ముఖ్యమంత్రి
సూపర్ స్టార్ రజనీకాంత్, ఐశ్వర్య రాయ్ జంటగా శంకర్ దర్శకత్వంలో కళానిధిమారన్ నిర్మించిన ఎంధిరన్(తెలుగులో రోబో) చిత్రాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి ప్రశంసించారు. ప్రపచంవ్యాప్తంగా శుక్రవారం విడుదలైన ఈ చిత్రాన్ని చెన్నై సత్యం థియేటర్ లో ముఖ్యమంత్రి కరుణానిధి తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిత్రం మంచి సాంకేతిక విలువలతో రూపొందిచారన్నారు. కెమేరా పనితనం అద్భుతంగా ఉందన్నారు. రజినీకాంత్ నటించిన శివాజీ కన్నా ఎంధిరన్ చాలా బావుందన్నారు. తమిళ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడం అభినందనీయమన్నారు.
రోబో చిత్రం సక్సెస్ విషయంలో దర్శకుడు శంకర్ తర్వాత సాంకేతికపరంగా ఎక్కువ మార్కులు పడేది రత్నవేలుకే. రోబో ఫోటోగ్రఫీ విషయంలో ఆల్రెడీ విమర్శకులు కూడా ప్రసంసలు అందించారు. అయితే రత్నవేలు తెలుగులో కూడా ఇంతకుముందు రెండు సినిమాలకు ఫోటోగ్రఫీ అందించిన విషయం చాలా తక్కువమందికే తెలుసు. అల్లు అర్జున్ కెరీర్ ను టర్నింగ్ తిప్పిన ఆర్య చిత్రంతో పాటు ఆర్య చిత్రదర్శకుడు సుకుమార్ రూపొందించిన జగడం చిత్రానికి కూడా రత్నవేలే ఫోటోగ్రఫీ అందించాడు. ఈ రెండు సినిమాలు కూడా ఫోటోగ్రఫి విషయంలో హై స్టాండర్డ్స్ లో వుంటాయి. ఇక రోబోతో ఈ కెమెరామెన్ ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా అవగతమైందన్న దాంట్లో ఆశ్చర్యపడాల్సిన అవసరంలేదు.


Click it and Unblock the Notifications











