twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మాజీ హీరోయిన్ సీత పై వ్యభిచారం చేస్తోందంటూ పోలీస్ కేసు

    By Srikanya
    |

    ఎన్నో తెలుగు సినిమాల్లో హీరోయిన్ గానూ, ఈ మధ్య కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ వస్తున్న సీత తాజాగా వ్యభిచారం కేసులో ఇరుక్కుంది. ఆమెపైన చెన్నైలోని సాలిగ్రామం ఏరియాలో కేసు నమోదు అయ్యింది. ఇంతకీ కేసు పెట్టింది మరెవరో కాదు. ఆమె ప్రక్కింట్లో ఉంటున్న మాయ. ఆమె చెన్నై పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ లో సీత వ్యభిచార నేరం చేస్తోందని, దాంతో ఆమె కోసం వచ్చే కష్టమర్లతో చాలా సమస్యలు తమకు తలెత్తున్నాయని, ముఖ్యంగా తమ ఇంటి గుమ్మం ముందు అంతా కారు పార్క్ చేసి వెళ్ళుతున్నారని ఆరోపించింది. ఈ కంప్లైంట్ విన్న చెన్నై చిత్ర పరిశ్రమ మొత్తం ఉలిక్కిపడింది. సీత తన భర్త పార్ధీవన్ తో విడాకులు తీసుకుని సతీష్ అనే టీవీ ఆర్టిస్టుని పెళ్ళి చేసుకుని కాపురం పెట్టింది.

    ఇక ఈ కొత్త భర్త సతీష్ ని..మాయ ఓ బ్రోకర్ గా వర్ణించింది. అతనే కష్టమర్స్ ని తీసుకొచ్చి ఆమెకు పరిచయం చేసి వ్యభిచారం దగ్గరుండి చేయిస్తున్నాడని ఆ కంప్లైంట్ లో రాసుకొచ్చింది. ఇక ఈ విషయమై సీత, సతీష్ లను పోలీసులు వివరణ అడగ్గా...చాలా కాలంగా తమకీ, మాయకీ మధ్య పార్కింగ్ గొడవలు ఉన్నాయని, అది దృష్టిలో పెట్టుకుని డైరక్ట్ గా తమను ఏమీ చేయలేక ఇలా తప్పుడు కంప్లైయింట్ ఇచ్చిందని చెప్తున్నారు. అలాగే తాము మూడు నెలల క్రిందటే ఇదే పార్కింగ్ గొడవపై మాయపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చామని గుర్తు చేసారు.

    సతీష్‌ మాట్లాడుతూ తాము మాయపై విరుగంబాక్కం పోలీస్‌ స్టేషన్ ‌లో మూడు నెలల కిందట, ఇటీవల గురువారం రాత్రి కేసులు పెట్టామన్నారు. "పోలీసులు శుక్రవారం విచారణకు వచ్చినప్పుడు మాయ ఇంట్లోనే ఉండి తాళం వేసుకుని నాటకం ఆడారు" అని పేర్కొన్న సతీష్‌ ఈ వీధిలో అందరూ ఆమెపై ఫిర్యాదులు చేస్తున్నారన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X