కమల్ హసన్ పై కమీషనరేట్ లో ఫిర్యాదు: నపుంసకులు అవుతారు అన్నందుకే

నీలవేంబు కుదినీర్ అనే మందుపై రెండు రోజుల కిందట కమల్ హాసన్ స్పందించిన విషయం తెలిసిందే. డెంగ్యూ - చికెన్ గున్యా లాంటి జబ్బులు రాకుండా తమిళ ప్రజలకు నీలవేంబు కుదినీర్ అనే మందు పంపిణీ చేస్తున్నారు. ఈ మంద

నీలవేంబు కుదినీర్ అనే మందుపై రెండు రోజుల కిందట కమల్ హాసన్ స్పందించిన విషయం తెలిసిందే. డెంగ్యూ - చికెన్ గున్యా లాంటి జబ్బులు రాకుండా తమిళ ప్రజలకు నీలవేంబు కుదినీర్ అనే మందు పంపిణీ చేస్తున్నారు. ఈ మందును పంపిణీ చేయొద్దంటూ తన అభిమానులకు పిలుపునిచ్చాడు కమల్.

నపుంసకులవుతారట

నపుంసకులవుతారట

ఆ మందులోని ఓ కారకం మనుషుల్లో వంధ్యత్వానికి (ఇన్-ఫెర్టిలిటీ) దారితీస్తుందని కమల్ ఆరోపించాడు. నీలవేంబు చెట్టు ఆకుల నుంచి తయారుచేసిన ఈ కషాయం వల్ల మనుషులు నపుంసకులవుతారని కమల్ చెప్పారు. దాని ఆ మందు శాస్త్రీయతను పరిశీలించిన తర్వాతే పంపిణీ చేయాలని తన అభిమానులకు పిలుపునిచ్చారు.

చెన్నై కమిషనరేట్ కు ఫిర్యాదు

చెన్నై కమిషనరేట్ కు ఫిర్యాదు

కేవలం అల్లోపతి వైద్యులు మాత్రమే .పరిశోధనలు చేయడం కాదని సంప్రదాయంగా వస్తున్న ఈ తరహా కషాయాలపై కూడా పరిశోధనలు జరిగాకే ప్రజలకు పంపిణీ చేయాలని కమల్ సూచించారు. కమల్ చేసిన వ్యాఖ్యలు తమ హక్కులకు భంగం కలిగించేలా ఉన్నాయని ఈ మందు పంపిణీ సభ్యుల్లో ఒకరు చెన్నై కమిషనరేట్ కు ఫిర్యాదు చేశారు. మనుషులలో ఉండే భయాల్ని కమల్ ప్రేరేపిస్తున్నారని పేర్కొన్నారు.

నీలవేంబు చెట్టు

నీలవేంబు చెట్టు

ఈ వ్యాఖ్యలు తమ హక్కుల్ని కాలరాసేలా ఉన్నాయంటూ ఈ మందు పంపిణీ సభ్యుల్లో ఒకరు చెన్నై కమిషనరేట్‌లో చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నీలవేంబు చెట్టు ఆకుల నుంచి తయారుచేసిన ఈ కషాయం వాడడం వల్ల మనుషులు నపుంసకులుగా తయారవుతారనే మాటలలో ఎలాంటి నిజం లేదని, కమల్‌ మనుషుల్ని భయపెడుతున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

 కమల్ కే మద్దతుగా ఉన్నారు

కమల్ కే మద్దతుగా ఉన్నారు

మరోవైపు తమిళనాడు ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా కమల్ వ్యాఖ్యల్ని ఖండించింది. ఈ కషాయం వాడకం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని స్పష్టం చేసింది.అయితే కమల్ అభిమానులు మాత్రం కమల్ కే మద్దతుగా ఉన్నారు. పూర్తి అవగాహన లేకుండా కమల్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయరని, ఇకనుంచీ తాము నీలవేంబు మందు పంపిణీలో సహకరించబోమంటూ చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X