విశాల్, శ్రియపై 'పులి' నిర్మాత కంప్లైంట్
విశాల్, శ్రియలపై పులి చిత్ర నిర్మాత శింగనమల రమేష్ కంప్లైంట్ చేసారు. తాను అడ్వాన్సుగా ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వటంలేదంటూ ఆయన నిర్మాతల మండలికి తెలిపారు. వివాదాన్ని స్పీకరించిన తమిళ నిర్మాతల మండలి ఇద్దరికీ నోటీసులు పంపింది. రమేష్ తో వివాదాన్ని సెటిల్ చేసుకోమని లేదా విశాల్ తాజా చిత్రం ఆపుచేస్తామనంటూ ప్రకటించారు. ఇంతకీ ఈ వివాదానికి కారణం ఏమిటని ఆరాతీస్తే శ్రియ కారణమని తెలుస్తోంది.
విశాల్-శ్రీయ జంటగా జంటగా 'తీర్ధవిలయాట్టు పిళ్లై" చిత్రాన్ని నిర్మించేందుకు తొలుత రమేష్ సంకల్పించారు. అందునిమిత్తం విశాల్ కు, శ్రియకు ఆయన భారీమొత్తంలో అడ్వాన్సులు చెల్లించారు. అయితే రకరకాల వంటి కారణాలవల్ల ఈ చిత్రాన్నిచేయలేని స్ధితిలో విశాల్ సోదరుడు విక్రమ్ ఈ ప్రాజెక్టు చేపట్టారు. తనతో ఓ ఒప్పందం కుదుర్చుకుని తననుంచి ఈ చిత్రాన్ని స్వాధీనం చేసుకున్న విక్రమ్, విశాల్ లు ఈ చిత్రం నిమిత్తం తను చెల్లించిన అడ్వాన్స్‌లు తనకు చెల్లించడంలో అలక్ష్యం చేస్తున్నారంటూ, రమేష్ ఇటీవల తమిళ నిర్మాతల మండలిని ఆశ్రయించాడు. విశాల్, శ్రీయలకు తను చెల్లించిన అడ్వాన్స్‌లను తనకు తక్షణమే ఇప్పించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
అయితే శ్రియకు తాము ఇచ్చే రెమ్యునేనషన్ వేరు, రమేష్ ఇచ్చిన రెమ్యునేషన్ వేరని విక్రమ్ అంటున్నాడు. ఆమెకు ఎక్కువ ఇచ్చారని,తాము రెగ్యులర్ గా ఇచ్చే రెమ్యునేషన్ పోగా ఆమె ఆ మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇస్తే రమేష్ కు ఇస్తామని,అలాగని ఆమెను ఇబ్బంది పెట్టేది లేదని కరాఖండిగా చెప్తున్నారు. అయితే శ్రియ తిరిగి ఇచ్చేది లేదు..ఈ కేసు సెటిల్ అయ్యేది లేదు. ప్రస్తుతం శింగనమల రేమేష్ పవన్ కళ్యాణ్ తో పులి చిత్రాన్ని, మహేష్ బాబుతో కలేజా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











