సర్కార్: యువతను చెడగొడుతున్నారంటూ హీరో విజయ్‌పై కంప్లయింట్
తమిళ స్టార్ విజయ్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో 'సర్కార్' అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ విడుదలవ్వగా విజయ్ స్మోక్ చేస్తూ స్టైలిష్ లుక్‌లో కనిపించాడు. అయితే ఈ పోస్టర్ కారణంగా హీరో విజయ్, దర్శకుడు మురుగదాస్ మీద కంప్లయింట్ నమోదైంది.
సినిమాలో స్మోకింగ్ సీన్లు ఉన్నాయని పోస్టర్ చూస్తేనే తెలుస్తోందని, ఇది సమాజం మీద, ముఖ్యంగా యువత మీద చెడు ప్రభావం చూపుతుందంటూ ఓ లాయర్ ఫిర్యాదు చేశారు. వెంటనే చెన్నై వ్యాప్తంగా ఉన్న 'సర్కార్' పోస్టర్లు తొలగించాలని సదరు లాయర్ చెన్నై పోలీస్ కమీషనర్‌ను రిక్వెస్ట్ చేశాడు.

ఫిల్మ్ మేకర్స్ సినిమాల్లో సిగరెట్ సీన్లు వాడకుండా ఉండాలంటే ప్రభుత్వం ముందు సిగరెట్లను నిషేధించాలని, అప్పుడే సినిమాల్లోనూ అలాంటి సీన్లు లేకుండా ఉంటుందని విజయ్ ఫ్యాన్స్ వాదిస్తున్నారు.
సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న 'సర్కార్' ఫస్ట్ లుక్ జూన్ 22న విజయ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు. విజయ్ స్టైలిష్ లుక్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. విదేశాల నుండి తన మాతృభూమికి తిరిగి వచ్చిన ఎన్ఆర్ఐ ఇక్కడి వ్యవస్థలోని లోపాలకు వ్యతిరేకంగా చేసే పోరాటం నేపథ్యంలో 'సర్కార్' మూవీ తెరకెక్కుతోంది.

విజయ్ కెరీర్లో 62వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. రెహమాన్ సంగీతం, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ ఈ సినిమాకు మరింత హైలెట్ కానున్నాయి.


Click it and Unblock the Notifications











