Don't Miss!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్‌పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- News అప్పుడు వైసీపీ..ఇప్పుడు టీడీపీ.. యంగ్ హీరో ఇలా మారిపోయాడేంటి..!
- Technology వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఇళయరాజాకు అనారోగ్యం...తాజా పరిస్ధితి
చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు, మెస్ట్రో ఇళయరాజా (72) ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. కాగా, ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉందనే విషయంపై వైద్యులు ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే మాకు అందిన కొంత సమాచారం మీకు అందిస్తున్నాం.
శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయనకు శ్వాస సంబంధిత సమస్య వచ్చింది. వెంటనే చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కొన్ని నెలల క్రితం ఇళయరాజాకు స్వల్ప స్ట్రోక్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన్ను కార్డియాలజీ విభాగానికి తీసుకెళ్లారు.
పరీక్షించిన వైద్యులు ప్రమాదమేమీ లేదని చెప్పారు. ఇళయరాజాకు పేగులో రక్తం గడ్డకట్టిందని వైద్యులు చెప్పినట్లు సమాచారం. ఆయన్ను గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగానికి మార్చి చికిత్స అందిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఇళయరాజాను డిశ్చార్జి చేసే అవకాశముంది.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
అయితే పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిచేదని ఆయనకు చెందినవారు చెబుతున్నప్పటికీ ఇళయరాజా ఆస్పత్రిలో చేరారన్న వార్త ఆయన అభిమానులను కలవరపాటుకు గురిచేసింది.
1943వ సంవత్సరం జూన్ 2వ తేదీన తమిళనాడులో జన్మించిన ఇళయరాజ ఒక నిరు పేదకుటుంబంలో జన్మించారు. కటిక పేదరికాన్ని అనుభవించిన ఆయన నేడు భారతదేశ సంగీత ప్రముఖ దర్శకులలో ఒకరిగా ఎదిగారు..1976లో విడుదలైన జయప్రద నటించిన 'భద్రకాళి అనే తెలుగు చిత్రంలోని 'చిన్ని చిన్ని కన్నయ్య" అనే పాటకు సంగీతాన్ని అందించి మ్యూజిక్ డైరెక్టర్ గా సినీరంగ ప్రవేశం చేసారు. తెలుగులో 'భద్రకాళి'కి తొలిసారి సంగీత దర్శకత్వం వహించినా, ఎన్టీఆర్ నటించిన 'యుగంధర్' మొదట విడుదలయింది.
నిత్య సంగీత సాధకుడుగా మన సంగీతానికి పాశ్చాత్య సంగీతం కూడా మేళవిస్తూ చక్కని బాణీలు కూర్చడం ఆయనకు అలవాటు అయింది. దాదాపు 3 దశాబ్దాల పాటు దక్షిణ భారత సినీ పరిశ్రమను ఏలిన సంగీత నటరాజు ఇళయరాజ. ఇళయరాజ మూడు సార్లు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకోవడమేకాక, 2004లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.
ఇళయరాజ సంగీతం వింటుంటే ఎవరైనా సరే అమాంతం తన్మయత్వం అయిపోవాల్సిందే. అంతటి ఘనత ఆయనది. ఆయన ఇప్పటి వరకు వేల పాటలకు, వందలాది చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చారు. ఆయన స్వరపరిచిన సుస్వరాలో తేలియాడని సంగీతాభిమాని ఉండరనడంలో అతిశయోక్తి కాదేమో!