వాటే కాంబినేషన్: శ్రీదేవి...సుదీప్...శృతి హాసన్
చెన్నై : శ్రీదేవి తెరపై కనిపించటం ఎప్పుడూ ఆమె అభిమానులకు పండుగే. అలాగే సుదీప్ మరో సారి ఈగ తర్వాత విలన్ గా అదరకొడుతూంటే చూడటానికి చాలా మందికి ఆసక్తి ఉంది. అయితే ఈ రెండూ త్వరలోనే జరగబోతున్నాయి. అయితే తెలుగు సినిమాలో మాత్రం కావు. విజయ్ హీరోగా నటిస్తున్న ఓ తమిళ చిత్రంలో ఈ రెండు చోటు చేసుకుని సినీ అభిమానులను అలరించనున్నాయి.
వివరాల్లోకి వెళితే...ఓవైపు 'కత్తి' సినిమా సమస్యల్లో కొట్టుమిట్లాడుతుండగా.. విజయ్ తన తదుపరి చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. '23వ పులికేసి', 'ఇరుంబుకోట్టె..' చిత్రాల దర్శకుడు శింబుదేవన్ దర్శకత్వంలో ఆయన నటించనున్నారు. చారిత్రాత్మక, వాస్తవిక చిత్రాలను రూపొందించే శింబుదేవన్.. విజయ్ కోసం యాక్షన్, ప్రేమకథా చిత్రాన్ని రూపొందించారు.

ఈ కథ విజయ్‌కి నచ్చడంతో నవంబరు ఎనిమిదోతేదీన చిత్ర ప్రారంభ కార్యక్రమం ఉంటుందని సమాచారం. ఇందులో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించనుంది. విశేషం ఏంటంటే.. అలనాటి అందాల తార శ్రీదేవి ఇందులో ముఖ్యపాత్ర పోషించనున్నారు. ఆమె మహారాణిగా కనిపించనుందని సమాచారం.
కన్నడ నటుడు సుదీప్ విలన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు 'రాజారాణి' ఫేం అట్లీ దర్శకత్వంలో కూడా నటించేందుకు విజయ్ ఒప్పుకున్నట్లు సమాచారం. ఏకకాలంలో రెండు సినిమాలను తెరకెక్కించనున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











