తమిళ అర్జున్ రెడ్డి మళ్ళీ ఆగిపోయిందా.. విక్రమ్ కొడుకుకే ఎందుకిలా!
స్టార్ హీరో విక్రమ్ తన తనయుడు ధృవ్ ని ఒక రేంజ్ లో చిత్ర పరిశ్రమకు పరిచయం చేయాలని భావించాడు. కానీ ధృవ్ తొలి చిత్రం అనుకున్నంత సాఫీగా జరగడం లేదు. అర్జున్ రెడ్డి చిత్రాన్ని చూసి ఇంప్రెస్ అయిన విక్రమ్ తన కుమారుడి తొలి చిత్రంగా ఇదే బావుంటుందని భావించాడు. వెంటనే బాల దర్శత్వంలో అర్జున్ రెడ్డి రీమేక్ ప్రారంభించారు. వర్మ టైటిల్ తో ఈ చిత్రం షూటింగ్ జరిగిపోయింది. ట్రైలర్ కూడా విడుదలైంది. కానీ విక్రమ్ కు అవుట్ పుట్ నచ్చకపోవడంతో చిత్రాన్ని రద్దు చేశాడు. ఈ సంఘటన మొత్తం అందరికి తెలిసిందే. తాజగా ధృవ్ సినిమా గురించి మరికొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి.

దర్శకుడిని తప్పించి
తన కొడుకు తొలి చిత్రం ఎలాగైనా విజయం సాధించాల్సిందే అని విక్రమ్ పట్టుదలతో ఉన్నాడు. వర్మ చిత్ర అవుట్ పుట్ సరిగా లేకపోవడంతో ఆ చిత్రాన్ని రద్దు చేశారు. దర్శకుడు బాలని తప్పించి ఆయన స్థానంలో గిరిసాయని ఎంపిక చేసుకున్నారు. వర్మ టైటిల్ ని కాస్త ఆదిత్య వర్మగా మార్చి తిరిగి షూటింగ్ ప్రారంభించారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ సాఫీగా జరుగుతోంది. అయినా కూడా విక్రమ్ కొడుకు చిత్రానికి పుకార్లు తప్పడం లేదు.

మళ్ళీ ఆగిపోయిందా
ధృవ్ తొలి చిత్రం మళ్ళీ ఆగిపోయిందని, ఆదిత్య వర్మ నిర్మాతలు మరోమారు షూటింగ్ ని రద్దు చేసినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ తో విసిగిపోయిన నిర్మాతలు షూటింగ్ రద్దు చేసి.. ఒరిజినల్ అర్జున్ రెడ్డి చిత్రాన్ని తమిళ్ లోకి డబ్ చేసి విడుదల చేయాలనే ఆలోచనలోకి వచ్చినట్లు వార్తలు వ్యాపించాయి. ఈ పుకార్లు చిత్రానికి డ్యామేజ్ కలిగించేలా ఉండడంతో నిర్మాతలు స్పందించారు.

అసత్య ప్రచారం
ఆదిత్య వర్మ నిర్మాతలు మాట్లాడుతూ ఈ చిత్రంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం అని తేల్చేశారు. ఆదిత్య వర్మ షూటింగ్ జోరుగా జరుగుతోంది. తదుపరి షెడ్యూల్ ని పోర్చుగల్ లో ప్లాన్ చేస్తున్నాము. ఆ షెడ్యూల్ పూర్తయ్యాక తిరిగి ఇండియాలో షూటింగ్ మొదలవుతుందని అన్నారు.

యంగ్ బ్యూటీతో రొమాన్స్
అర్జున్ రెడ్డి చిత్రంలో ప్రధానంగా యువతని ఆకర్షించిన విషయం హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ. బోల్డ్ కంటెంట్ ఉన్న చిత్రంలో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ చాలా కీలకం. ధృవ్ సరసన నటించేందుకు చిత్ర యూనిట్ బాలీవుడ్ యువ నటి బనితా సంధుని ఎంపిక చేసుకున్నారు. విక్రమ్ ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసే విలక్షణ నటుడిగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఇక ధృవ్ తొలి చిత్రంతో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











