థగ్ లైఫ్ కాంట్రవర్సీ.. శింబు వల్ల మొదట్లోనే పెద్ద గొడవ

కోలీవుడ్ స్టార్ హీరో శింబు ( Silambarasan TR )కు తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు ఉంది. ఆయన నటించిన మన్మథ చిత్రం ఇక్కడ బాగా హిట్టైంది. ఆ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించింది. మరోవైపు శింబు నటనకు కూడా ప్రశంసలు అందాయి. ఈ చిత్రం 2004లో విడుదలైంది. అప్పటి నుంచి శింబుకు ఇక్కడ మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక ఇదిలా ఉంటే.. ప్రస్తుతం శింబు 'థగ్ లైఫ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే ఈ చిత్రం ప్రారంభంలోనే శింబుతో పెద్ద గొడవ అయ్యినట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

థగ్ లైఫ్ సినిమా వివరాలు..
లోకనాయకుడు కమల్ హాజన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'థగ్ లైఫ్'. గ్రేట్ డైరెక్టర్ మణి రత్నం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జూన్ 5న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇందులో శింబు కీలక పాత్ర పోషించారు. త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటించింది. అభిరామి మరో హీరోయిన్ గా నటించడం విశేషం. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ గెయింట్ మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమైంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

Controversy with Silambarasan TR before begin Kamal Haasan Thug Life Movie

థగ్ లైఫ్ సినిమా వివాదం..
థగ్ లైఫ్ సినిమా రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మే 5న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. దీంతో సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు మేకర్స్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటకలో భారీ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడిన మాటలు చాలా వివాదాస్పదంగా మారాయి. దాంతో థగ్ లైఫ్ చిత్రాన్ని కర్ణాటకలో విడుదల కానివ్వబోమని హెచ్చిరించారు. ఇంకా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది.

శింబు పై మొదట్లోనే గొడవ?
తమిళ స్టార్ హీరో శింబుతో మొదట్లోనే థగ్ లైఫ్ చిత్రం వివాదంలో చిక్కుకుంది. శింబును ఈ చిత్రానికి ఎంపిక చేయడంపై తమిళ నిర్మాత ఇషారి కే గణేశ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తమళ ఫిల్మ్ ఛాంబర్స్ కౌన్సిల్ శింబుకు రెడ్ కార్డ్ జారీ చేసిందని ఆరోపించారు. ఆయన్ని కొత్త ప్రాజెక్ట్ లకు తీసుకోవద్దనే నిబంధనలను ఉల్లంఘించవద్దని చెప్పారు. కానీ శింబు మాత్రం తనకు ఎలాంటి రెడ్ కార్డ్ అందలేదని 2024లో ఈ ఘటన జరగడంతో వెంటనే స్పందించారు.

శింబు రాబోయే చిత్రాలు..
చివరిగా శింభు పాతు తాలా అనే చిత్రంలో నటించారు. తమిళంలోనే విడుదలైంది. ఇప్పుడు తన 49వ చిత్రంలో నటించేందుకు సిద్ధమయ్యారు. రామ్ కుమార్ బాలకృష్ణ దర్శకత్వం వహించబోతున్నారు. సంతానం కీలక పాత్ర పోషించనున్నారు. డ్రాగన్ ఫేమ్ హీరోయిన్ కయాదు లోహర్ ఫీమేల్ లీడ్ గా నటించనుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X