Coolie Censor Report: కూలీకి రెండోసారి సెన్సార్.. ర్యాప్ సాంగ్స్‌తో రజనీ కేక .. రన్‌టైమ్ ఎంత పెరిగిందంటే?
ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కూలీ. తమిళంలో పాపులర్ సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, శృతి హాసన్ తదితరులు నటించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా చిత్రంలో రెబ్బా మోనికా జాన్, మలయాళ దర్శకుడు, నటుడు సౌబీన్ షాహిర్, జూనియర్ ఎంజీఆర్ తదితరులు నటిస్తున్నారు.
ఈ సినిమాకు గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫి, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్, ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వరిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్‌కు సిద్దమవుతున్న ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్నది. అయితే తాజాగా సెన్సార్ పూర్తి అయిన తర్వాత కొన్ని సీన్లను అదనంగా చేర్చినట్టు సెన్సార్ అధికారి తన రిపోర్టును అధికారికంగా వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే..

సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) చెన్నై విభాగం ఎగ్జామినింగ్ ఆఫీసర్ ఏ ముత్తు కృష్ణన్ ఈ సినిమా సెన్సార్ రిపోర్టు గురించి వెల్లడిస్తూ.. గతంలో ఈ సినిమా నిడివిని 169.57 నిమిషాలు. అయితే ఈ సినిమాకు కొన్ని సీన్లను అదనంగా చేర్చిన అనంతరం ఫైనల్‌గా 170.22 నిమిషాల నిడివిని ఫిక్స్ చేశారు అని ఆయన తెలిపారు. ఈ మార్పులు సెన్సార్ రూల్ 33 ప్రకారం చేసినట్టు ఆయన తన సర్టిఫికెట్‌లో వెల్లడించారు.
అయితే ఈ సినిమాకు అదనంగా చేర్చిన వాటి వివరాల్లోకి వెళితే.. సూపర్ స్టార్ రజనీకాంత్ తన సినీ రంగం కెరీర్‌లో 50 ఏళ్లను పూర్తి చేసుకొన్నారు. ఈ నేపథ్యంలో యానిమేషన్‌తో కూడిన Rajini 50 Years వీడియోను యాడ్ చేశారు అని తెలిపారు. అలాగే దయాల్ (సౌబీన్ షాహిర్) ఇంట్రడక్షన్ సీన్‌కు ర్యాప్ సాంగ్‌తో కూడిన మ్యూజిక్ బిట్‌ను యాడ్ చేశారు. అయితే నిడివి విషయంలో ఎలాంటి మార్పు లేదని తెలిపారు.
అలాగే.. సైమన్ (నాగార్జున అక్కినేని) కొందరిని ఎటాక్ చేసే సీన్‌కు సంబంధించిన విజువల్స్‌కు ర్యాప్ మ్యూజిక్ యాడ్ చేశారు. అలాగే దయాల్‌ను సైమన్ ఎటాక్ చేసే సీన్‌కు కూడా ర్యాప్ మ్యూజిక్ యాడ్ చేశారు. ఇక ఆల్ యూ మాబ్‌స్టర్స్ అనే పాటను ఇదివరకే సర్టిఫై చేశాం. ఆ పాటలో దేవా (రజనీకాంత్), ప్రీతి (శృతిహాసన్) కలిసి నడిచి వచ్చే సన్నివేశానికి పాటను యాడ్ చేశాం అని తెలిపారు. ఈ సీన్లకు నిడివి పెద్దగా మార్చలేదు అని స్పష్టం చేశారు.
ఇక రౌడీలను దేవా ఎటాక్ చేసే సీన్‌ను ఇదివరకే సర్టిఫై చేశాం. లేడీస్ అండ్ జెంటిల్మన్ అనే ర్యాప్ సాంగ్ యాడ్ చేశాం. , అలాగే తన గతాన్ని గుర్తు చేసుకొని ఓ మహిళ కొందరిని చంపే సీన్‌లో యూ హావ్ గాట్ దట్ లుక్ అనే పాటను యాడ్ చేశాం. నిడివిలో ఎలాంటి తేడా ఉండదు అని సెన్సార్ అధికారి తెలిపారు.
ఇదిలా ఉండగా,. ఈ సినిమాకు రెండు రకాల సెన్సార్ సర్టిఫికెట్స్ లభించాయి. ఇండియాలో A సర్టిఫికెట్, దుబాయ్‌లో PG15 సర్టిఫికెట్ ఇచ్చారు. యూఏఈలో 15 ఏళ్లకుపైబడిన వారు చూసే విధంగా వెసలుబాటు కల్పించారు. 36 ఏళ్ల తర్వాత రజనీకాంత్ సినిమాకు A సర్టిఫికెట్ రావడం చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











