For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ టాపిక్ : స్టార్ హీరో చిత్రం కాపీ పోస్టర్

    By Srikanya
    |

    చెన్నై : సీన్స్,కథలు,యాక్షన్ సీన్స్ హాలీవుడ్ నుంచి ఎరువు తెచ్చుకోవటం దాటి ఇప్పుడు పోస్టర్స్ దాకా పాకింది. తాజాగా తమిళ సినిమా వర్గాల్లో 'తుపాకి' చిత్రం పోస్టర్ హాట్ టాపిక్ గా మారింది . స్టార్ హీరో విజయ్ హీరోగా నటించిన ఈ చిత్రం తాజా పోస్టర్...హాలీవుడ్ చిత్రం పోస్టర్ An Officer and a Gentleman చిత్రం పోస్టర్ ని యాజటీజ్ గా దింపేయటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. సంచలన దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం 'తుపాకి'.

    విజయ్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 75 కోట్ల భారీ వ్యయంతో జెమినీ ఫిల్మ్ సర్క్యూట్స్ సంస్థ నిర్మిస్తోంది. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో ఎస్వీర్ మీడియా సంస్థ విడుదల చేస్తోంది. మురగదాస్ తన పంథాకు భిన్నంగా ఫుల్ లెన్త్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా దీన్ని రూపొందిస్తున్నారు. హేరిష్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈచిత్రానికి సంతోష్ శివన్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు.

    ఓ చిన్న గ్రామం నుంచి ముంబయ్ వెళ్లి అక్కడ డాన్‌ అవతారమెత్తిన ఓ యువకుడి కథ ఈ సినిమా. గత నాలుగు నెలల నుంచీ ఈ చిత్రం టైటిల్ పై వివాదం కొనసాగింది. రీసెంట్ గా ఈ టైటిల్ వివాదం రాజీకొచ్చి విడుదలకు సిద్దమవుతోంది. ఈ భారీ చిత్రాన్ని విజయ్ తండ్రి ఎస్ఎ చ్రందశేఖర్ నిర్మిస్తుండటం విశేషం. మురుగదాస్‌కున్న క్రేజ్‌, కాజల్‌కు ఉన్న ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని తెలుగులోనూ భారీగా విడుదల చేస్తున్నారు.

    ఈ సందర్భంగా ఎస్వీఆర్ మీడియా అధినేత సీజే శోభా చిత్ర విశేషాలను తెలియజేస్తూ 'తన ప్రతి చిత్రాన్ని ఓ అద్భుతమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కించే మురుగదాస్ ఈ చిత్రాన్ని కూడా ఓ వండర్‌లా తీర్చిదిద్దుతున్నాడు. త్వరలోనే పాటలను విడుదల చేసి దీపావళికి తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తప్పకుండా ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించబోతుంది' అన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, మాటలు: శ్రీరామకృష్ణ.

    English summary
    The newly released poster of Thuppakki has striking resemblances with 1982s Hollywood movie An Officer and a Gentleman directed by Taylor Hackford. The poster of Richard Gere (wearing navy outfit) lifting Debra Winger (sporting his hat) in his arms, and Kajal resting in police-uniform clad Vijay are similar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X