twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లారెన్స్ గొప్ప మనసు.. అన్ని వర్గాలకు అండగా.. భారీ విరాళమిచ్చిన దర్శకుడు

    |

    కరోనా లాంటి విపత్కర పరిస్థితిలో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతోంది. విరుగుడంటూ లేని ఈ వైరస్ మానవాళికి శాపంగా మారింది. ఇప్పటికే వేల మందిని పొట్టన బెట్టుకున్న ఈ వైరస్.. మన దేశంలోనూ శరవేగంగా విస్తరిస్తోంది. మన దేశంలో ఇప్పటి వరకు ఆరు వేల మందికి పైగా కరోనా సోకింది. వందకు పైగా కరోనాకు బలి అయ్యారు. ఇలాంటి భయానక వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు అహర్నిశలు శ్రమిస్తూనే ఉన్నాయి.

    తాండవం చేస్తున్న వైరస్..

    తాండవం చేస్తున్న వైరస్..

    చైనాలో పుట్టిన ఈ వైరస్.. ప్రపంచాన్నే శాసిస్తోంది. కరోనా దెబ్బకు అగ్రరాజ్యం కుప్పకూలిపోయింది. ఆరు లక్షల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. వేల మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. ఇండియాలోనూ కరోనా వైరస్ తాండవం చేస్తోంది. ఇప్పటికే ఆరువేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనాను అడ్డుకునేందుక 21 రోజుల పాటు లాక్ డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే.

    లాక్ డౌన్‌తో ఉపాధి కరువు..

    లాక్ డౌన్‌తో ఉపాధి కరువు..

    21 రోజుల పాటు లాక్ డౌన్ విధించడంతో ప్రజలంతా ఇంటి పట్టునే ఉండాల్సి వస్తోంది. ఈ కారణంగా ఎంతో మంది ఉపాధిని కోల్పోయారు. ఈ క్రమంలో సినీ కార్మికులకు అండగా నిలబడేందుకు తారలు ముందుకు వస్తున్నారు. తమ పరిశ్రమకు చెందిన శ్రామికులను ఆదుకునేందుకు సెలెబ్రిటీలంతా కదిలి వస్తున్నారు.

    ఫెఫ్సీకి విరాళాల వెల్లువ

    ఫెఫ్సీకి విరాళాల వెల్లువ


    కరోనా లాంటి కష్టకాలంలో సినీ పరిశ్రమలో శ్రామికులను ఆదుకునేందుకు ఆయా భాషల సెలెబ్రెటీలు ముందుకు వస్తున్నారు. అలాంటి వారికోసం టాలీవుడ్‌లో కరోనా క్రైసిస్ ఛారిటీని స్థాపించిన సంగతి తెలిసిందే. దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి పిలుపు మేరకు కోలీవుడ్ అంతా కదలింది. రజినీ కాంత్ మొదటగా యాభై లక్షలు విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే.

    Recommended Video

    Balakrishna Donations To CCC and CM Relief Funds, See Chiranjeevi Reaction
    భారీ విరాళాన్నిచ్చిన లారెన్స్..

    భారీ విరాళాన్నిచ్చిన లారెన్స్..


    కరోనా కష్టకాలంలో ప్రభుత్వానికి అండగా ఉండేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక సాయాన్ని ప్రకటించాడు లారెన్స్. అంతేకాకుండా సినీ కార్మికులకు, వికలాంగులకు, వృద్దులకు ఇలా సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు ఆర్థిక సాయాన్ని ప్రకటించాడు. వీటన్నంటికి కలిసి మూడు కోట్లు ప్రకటించినట్టు సోషల్ మీడియాలో తెలిపాడు.

    English summary
    Corona effect Raghava Lawrence Donated 3 Crores. He Is Released A Press Note About Donations. He Donated To Central And State Governments And FEFSI.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X