కోలీవుడ్‌పై రోజా భర్త ఫైర్.. మానవత్వం లేదని ఆర్కే సెల్వమణి ఆవేదన

కరోనా వైరస్‌కు మానవాళి మొత్తం గజగజవణికిపోతోంది. ప్రపంచ దేశాలు ప్రాణాలను గుప్పిట్లో పట్టుకుని కరోనాతో పోరాడుతున్నాయి. కరోనా దెబ్బకు అగ్రరాజ్యం కుదేలైంది. మన దేశంలోనూ కరోనా మహమ్మారి తాండవం చేస్తోంది. కరోనా వైరస్ ధాటిని ఎదుర్కొనేందుకు 21 రోజులు పాటు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.

 దిక్కుతోచని స్థితిలో కార్మికులు..

దిక్కుతోచని స్థితిలో కార్మికులు..

లాక్ డౌన్ కారణంగా దినసరి కూలీలు, రోజూవారి వేతన కార్మికుల పరిస్థితి దిక్కుతోచని విధంగా మారింది. సినీ పరిశ్రమకు చెందిన శ్రామికుల పరిస్థితి కూడా అంతే దయనీయంగా మారింది. వారిని ఆదుకునేందుకు సినీ తారలు ముందుకు వస్తున్నారు.

 టాలీవుడ్‌లో విరాళాల వెల్లువ..

టాలీవుడ్‌లో విరాళాల వెల్లువ..

కరోనాతో పోరాడేందుకు ప్రభుత్వాలకు అండగా ఉండేందుకు సినీ తారలు ముందుక వచ్చారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి హీరోలు భారీ మొత్తంలో ప్రభుత్వాలకు విరాళాలు అందించారు. సినీ కార్మికుల కోసం చిరంజీవి ప్రత్యేకంగా కరోనా క్రైసిస్ ఛారిటీని ప్రారంభించి కోటి రూపాయల విరాళాన్ని అందించాడు.

ఫెఫ్సీ అధ్యక్షుడి పిలుపు..

ఫెఫ్సీ అధ్యక్షుడి పిలుపు..

దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడు, ప్రముఖ దర్శకుడు ఆర్‌.కె.సెల్వమణి ఇచ్చిన పిలుపు మేరకు రజినీకాంత్ ముందుకు వచ్చాడు. సినీ కార్మికులను ఆదుకునేందుకు యాభై లక్షల విరాళాన్ని ప్రకటించాడు. ఆపై మరి కొంత మంది యువ హీరోలు కూడా విరాళాలు ఇచ్చారు. అయితే అవి అనుకున్న స్థాయిలో రాకపోవడంతో ఆర్కే సెల్వమణి ఫైర్ అయ్యాడు.

Recommended Video

Balakrishna Donations To CCC and CM Relief Funds, See Chiranjeevi Reaction
నటీనటులకు మానవత్వం లేదు..

నటీనటులకు మానవత్వం లేదు..

ఫెఫ్సీకి ఇప్పటి వరకు రూ. 1.60 కోట్లు విరాళం అందిందని తెలిపాడు. దీంతో సమాఖ్యలోని ఒక్కో సభ్యుడికి 25 కిలోల బియ్యం, రూ. 500 నగదు మాత్రమే సాయం చేయగలుగుతుందని, ఇది వారి కుటుంబానికి ఏ మాత్రం సరిపోదని పేర్కొన్నాడు. ఇతర రాష్ట్రాల్లో నటీనటులు కోట్ల రూపాయల్లో ఆర్థికసాయం అందిస్తున్నారని, అలాంటిది మన నటీనటులకు సాయం చేసే మానవత్వం లేకపోయిందని ఆర్కే ఆవేదన చెందాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X