క్లైమాక్స్ కే నాలుగు కోట్లు ఖర్చు..
విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న రాజపట్టి చిత్రం క్లైమాక్స్ కి నాలుగు కోట్లు ఖర్చు పెడుతున్నారు. చాలా రిచ్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పూర్తి స్ధాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న రాజబాట్టయ్ చిత్రంలో హీరోయిన్ గా దీక్షాసేధ్ చేస్తోంది.ఈ క్లైమాక్స్ ని ఎనిమిది రోజులు పాటు చిత్రీకరించారు. యవన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ కి విడుదల అవుతోంది.ఇక గతంలో విక్రమ్ నటించిన నాన్న చిత్రం కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు.విమర్శకుల ప్రశంసలు అందుకున్నా అనుకున్న రేంజిలో విక్రమ్ కి పేరు తేలేదు. దాంతో నిరాశలో ఉన్న విక్రమ్ ఈ చిత్రంపైనే పూర్తి దృష్టి పెట్టారు. ఇక దీక్షాసేధ్ విషయానికి వస్తే... గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న నిప్పులో కూడా ఆమె నటిస్తోంది.ఈ చిత్రాన్ని మరో దర్శకుడు వైవియస్ చౌదరి నిర్మిస్తున్నారు.
ఇక ఆమె నిప్పు లో కాకుండా ...లారెన్స్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 'రెబల్" లక్ష్మిప్రసన్న నిర్మాతగా మనోజ్‌తో 'ఊ కొడతార ఉలిక్కి పడతారా" చిత్రాలలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాలన్నీ సెట్స్‌లో సందడి చేస్తున్నాయి. తమిళంలో విక్రమ్‌తో ఓ సినిమా, శింబుతో ఓ సినిమాలో నటిస్తూ అక్కడా లైమ్‌లైట్‌లో ఉంది. శింబుతో 'వేట్టై మారన్" భారీ యాక్షన్‌తో తెరకెక్కుతోంది. తెలుగు, తమిళ్, హిందీలో ఈ సినిమాని ఏకకాలంలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సుశీంద్రన్ దర్శకత్వంలో విక్రమ్‌తో 'రాజపట్టై"లోనూ దీక్షాసేథ్ నటిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 23న తెలుగు, తమిళ్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. హైదరాబాద్ టు చెన్నై, చెన్నై టు హైదరాబాద్ ఠంఛనుగా తిరుగాడుతూ..తెగ బిజీగా గడిపేస్తోంది.


Click it and Unblock the Notifications











