twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాపీ వివాదం: విజయ్, మురుగదాస్‌కు కోర్టు సమన్లు!

    By Bojja Kumar
    |

    తంజావూరు: తమిళ హీరో విజయ్, దర్శకుడు ఏఆర్ మురుగదాస్ లకు కోర్టు సమన్లు జారీ చేసింది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తమిళ చిత్రం ‘కత్తి' సినిమాకు సంబంధించిన ఈ సమన్లు జారీ అయ్యాయి. తన డాక్యుమెంటరీ ఫిల్మ్ ‘త్యాగ భూమి' నుండి స్టోరీలైన్ కాపీ కొట్టి ‘కత్తి' చిత్రం తెరకెక్కించారని అంబు రాజశేఖర్ అనే వ్యక్తి పిటీషన్ దాఖలు చేయడంతో కోర్టు సమన్లు జారీ చేసింది.

    ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్

    Court orders issue of summons to Vijay, A R Murugadoss

    ఈ మేరకు ‘కత్రి' చిత్రం హీరో విజయ్, దర్శకుడు మురుగదాస్, నిర్మాతలు కరుణాకరన్, సుబ్బలక్ష్మి సుబ్బాష్ కరణ్ జనవరి 7, 2015న కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా సమన్లలో పేర్కొన్నారు. ఈ సినిమాను ఇతర బాషల్లోకి అనువదించడం లాంటి కూడా చేయవద్దని కోర్టును కోరారు.

    విజయ్, సమంత హీరో హీరోయిన్లుగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం కత్తి దక్షిణాదిన సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సినిమా విడుదలైన 12 రోజుల్లో 100 కోట్ల రూపాయల మైలురాయిని చేరుకుంది. అతితక్కువ కాలంలో ఈ ఖ్యాతిని సొంతం చేసుకున్న తొలి దక్షిణాది చిత్రం ఇదే కావడం విశేషం. ‘కత్తి' సినిమా విషయానికి వస్తే ఇది సెజ్, రైతులకు మధ్య జరిగే పోరాటానికి సంబంధించిన సినిమా. రైతులు తమ భూములను ఎలా కోల్పోతున్నారు. ఎందుకు రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వ్యవసాయానికి నీరు ఎంత అవసరం. అటువంటి నీటివనరుని ఆక్రమించి బీరు ఫ్యాక్టరీ కట్టాలనుకునే ఓ మల్టీనేషనల్ కంపెనీని ఓ గ్రామానికి చెందిన యువకుడు ఎలా ఎదుర్కొన్నాడు. రైతులతో ప్రజల్లో ఎలాంటి చైతన్యాన్ని తీసుకువచ్చాడనేదే ప్రధానాంశంగా సినిమా సాగుతుంది.

    English summary
    A court here today ordered summons to actor Vijay, A R Murugadoss, director of Tamil movie "Kathi" and its producers in connection with a petition filed by one Anbu Rajasekhar, who claimed that the plot of the film had been copied from his documentary "Thaga Bhoomi".
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X