హిందీలో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న గజనీ సినిమా వసూళ్ళ వివరాలను దాఖలు చేయాలని గీతా ఆర్ట్స్ సంస్ధకు మద్రాస్ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్రం విడుదలై పది రోజులు కావుస్తున్నా,ఇంత వరకూ చిత్రం వసూళ్ళ వివరాలను కోర్టు దృష్టికి ఎందుకు తీసుకురాలేదంటూ న్యాయమూర్తులు ధనపాలన్,సత్యనారాయణలతో కూడిన బెంచ్ ప్రశ్నించింది.దీనిపై గీతా ఆర్ట్స్ తరుపు న్యాయవాదులు సమాధానం ఇస్తూ ఈ చిత్రం దేశ వ్యాప్తంగా రిలీజైన దృష్ట్యా వసూళ్ళ వివరాలు రావటంలో జాప్యం నెలకొందని,మరో వారం రోజులు గడువు ఇవ్వాలని కోరారు.