Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రాసలీలల రంజితకు క్రేజ్ అంతా ఇంతా కాదు.. పర్ డేకి ఏకంగా 5లక్షలే..
సినీ పరిశ్రమలో గాని, సొసైటీలో గాని డబ్బు సంపాదించటానికి ఎన్నో అవినీతికి మార్గాలు ఉన్నాయి. అయితే నైతిక విలువలను, దేశభక్తిని వదులుకున్నవారికే ఈ సమాజంలో పెద్ద పీఠం వేస్తుంది. వారే ఈ దేశాన్ని కూడా పరిపాలిస్తున్నారు. అవినీతి ఎంత చేసి పైకొస్తే వారే అంత పెద్ద మనుషులుగా తయారవుతన్నారు. సెక్స్ కుంభకోణం, సంచలనాన్ని కలిగించి అందరి దృష్టిలో పడిన రంజిత వెంట ప్రొడ్యూసర్స్ పరిగెత్తుతున్నారు. అంటే సినిమాలో నటించమని నిర్మాతలు ఆమె వెంట పడుతున్నారని వార్త.
ప్రస్తుతం రంజితకు ఉన్న క్రేజ్ ను సినిమాలో పెట్టి క్యాష్ చేసుకుందామని నిర్మాతల దురాలోచన అన్నమాట. అయితే రంజిత మాత్రం రోజుకు 5లక్షల డిమాండ్ చేస్తుంది. అయినా ఆ రేటుకు నిర్మాతలు ఒప్పుకుంటున్నారని కోలీవుడ్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రోజుకు 5లక్షల డిమాండ్ చేసే నటుడు కోలీవుడ్ లో ఒక్క 'వడివేలు" మాత్రమే ఉన్నారు. టాలీవుడ్ లో ఇంత మొత్తం తీసుకున్న నటుడు కానీ, నటిగానీ లేరని చెప్పచ్చు. ఏమైతేనెం రాసలీల రంజితకు ఇప్పుడు సినిమా నటిగా మరలా పుంజుకొందని చెప్పొచ్చు.