రాజమౌళి 'ఈగ'లో నటిస్తున్న క్రేజీ రైటర్
కమల్ హాసన్ చిత్రాలు రెగ్యులర్ గా చూసేవారికి ప్రముఖ తమిళ రచయిత క్రేజీ మోహన్ పంచ్ లు పరిచయమే. పంచతంత్రం, మైకేల్ మదన కామరాజు, అపూర్వ సోదరులు వంటి చిత్రాలకు అద్బుతమైన సంభాషణలు అందించిన క్రేజీ మోహన్ ..ఈసారి తమిళ వెర్షన్ 'ఈగ'కి డైలాగులు ఇస్తున్నారు. అంతేగాక ఆ చిత్రంలో ఆయన ఓ మంచిపాత్రను కూడా చేస్తున్నారు. తన పాత్ర కథలో కీ రోల్ ప్లే చేస్తుందని చెప్తున్నారు. ఆ విషయమై ఆయన మీడియాతో మాట్లాడారు.
క్రేజీ మోహన్ మాటల్లో...నా డైలాగ్స్ బాగుంటాయని రాజమౌళి అంటుండేవారు. సబ్జెక్టు ఏంటో చెప్పి, డైలాగ్స్ రాయమన్నారు. ఉదాహరణకు కొన్ని వినిపించాను. ఆయనకు బాగా నచ్చాయి. తక్కువ నిడివితే సంభాషణ ఉండి, హావభావాన్ని అవకాశం కల్పిస్తుంది. మొత్తంగా ప్రేక్షకున్ని అలరిస్తుంది. అంతేగాక తమిళ వెర్షన్‌లో ఓ పాత్ర వేశాను. కథ ప్రతీకారానికి సంబంధించిందే అయినా, ఆహ్లాదంగా కథ నడుస్తుంది అన్నారు.
అలాగే..భిన్నమైన కథాంశాలను కమర్షియల్‌గా తెరకెక్కించాలనుకునే వ్యక్తి రాజమౌళి అన్నారు. ఒకే విధంగా మూస పద్ధతిలో వెళ్లాలనుకోవడం లేదు. తెలుగు, తమిళ భాషల్లో చేస్తున్న నటీనటులందరికీ ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుందని భావిస్తున్నా. ఇక కథ గురించి ఇంకా విపులంగా చెప్పకూడదు..కానీ సబ్జెక్టు మాత్రం డిఫరెంట్. త్వరలో 'ఈగ' తమిళ, తెలుగు భాషల్లో రానుంది. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పగలను. కథలో విషయం ఉంది అని అన్నారు.
నాని, సమంత జంటగా నటించిన చిత్రం 'ఈగ'. సుదీప్ ముఖ్యభూమిక పోషించారు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. సాయి కొర్రపాటి నిర్మాత. డి.సురేష్‌బాబు సమర్పకులు. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాల్లో భాగంగా ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్ పనులు జరుగుతున్నాయి.
ఇక ఈగ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ ''ఒక వ్యక్తిపై ఈగ ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఆ ప్రయత్నం ఫలించిందా..? లేదా? అనే ఆసక్తికరమైన విషయాలతో సాగే చిత్రమిది. ఇటీవల విడుదలైన పాటలకు చక్కటి స్పందన లభిస్తోంది. యూట్యూబ్‌లో 'ఈగ' ప్రచార చిత్రాలకు కూడా విశేషంగా ఆదరణ లభిస్తోంది. వారం రోజుల్లో దాదాపు 5 లక్షల 63 వేల మంది వీక్షించారు. మహేష్‌బాబు, రామ్‌చరణ్ నుంచి కూడా ప్రచార చిత్రాలకు అభినందనలు లభించాయి. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కె.కె.సెంథిల్‌కుమార్, సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి.


Click it and Unblock the Notifications











