Don't Miss!
- News 12ఏళ్ల తర్వాత వృషభరాశిలోకి బృహస్పతి: ఈ రాశులవారికి ఆకస్మిక ధనలాభం!!
- Sports PBKS vs RR: ఆ తప్పిదమే మా కొంపముంచింది: సామ్ కరణ్
- Lifestyle ఈ 5 రాశుల స్త్రీలు స్వాతంత్య్ర పక్షుల్లా ఎగరడానికే పుట్టారు... వారికి వారి స్వేచ్ఛ ముఖ్యం...
- Automobiles నిండా పాతికేళ్ళు కూడా లేదు.. ఖరీదైన కారు కొనేసాడు - ధర తెలిస్తే షాకవుతారు!
- Finance Health Drinks: హెల్త్ డ్రింక్ కేటగిరి నుంచి బోర్న్ వీటాను తొలగించండి..
- Technology వాట్సాప్ కొత్త నంబర్‌కు మారుతున్నారా.. పాత చాట్‌ను ఎలా బదిలీ చేసుకోవాలో తెలుసా..!
- Travel వేసవిలో పర్యాటకుల కోసం తెలంగాణ టెంపుల్ టూర్ ప్యాకేజీ..వివరాలివే..?!
విజయ్ అభిమానులకు కిక్కిచ్చిన ఆస్ట్రేలియా క్రికెటర్.. మరో వీడియో వైరల్
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కు ఇండియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మెయిన్ గా తెలుగు రాష్ట్రాల్లో అయితే అతన్ని ఒక స్టార్ హీరో రేంజ్ లో లైక్ చేస్తున్నారు. హైదరాబాద్ సన్ రైజర్స్ కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నాడు. ఇక ఆడియెన్స్ అభిరుచికి తగ్గట్లుగా వార్నర్ వదులుతున్న వీడియోలు చాలానే వైరల్ అవుతున్నాయి.
న్యూ ఇయర్ కు నెవర్ బిఫోర్ అనేలా మహేష్ బాబు లుక్కుతో కొత్తగా కనిపించిన విషయం తెలిసిందే. మహర్షి సినిమాలో మహేష్ బాబు ఎలాగైతే కనిపించాడో అలానే తన ఫేస్ ను ఎడిట్ చేసి వీడియోను విడుదల చేశాడు. గతంలోనే డేవిడ్ వార్నర్ విభిన్న రకాలుగా మహేష్ స్టైల్ ను ఫాలో అయ్యాడు. ఇక ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ లుక్కుతో మరో కిక్కిచ్చాడు.
దళపతి ట్రెండ్ సెట్ చేసిన హావభావాలను మిక్స్ చేసి ఫేస్ మార్ఫింగ్ చేసిన వార్నర్ దీనికి క్యాప్షన్ ఇవ్వండని కామెంట్ చేశాడు. ఇక ఆ వీడియో నిమిషాల్లోనే వైరల్ అయ్యింది. విజయ్ ఫ్యాన్స్ అయితే లుక్ మాత్రం అదిరిపోయింది అంటున్నారు. స్మైల్, యాక్షన్, డైలాగ్స్ చెప్పడం ఇలా అన్ని విషయాల్లో డేవిడ్ మహర్షి అదిరిపోయాడని కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా వార్నర్ కిర్రాక్ అనే ట్యాగ్స్ అయితే ఎక్కువగా అందుతున్నాయి. చూస్తుంటే భవిష్యత్తులో ఈ స్టార్ క్రికెటర్ హీరో అయినా అయిపోవచ్చని అంటున్నారు.