Cricketer Harbhajan Singh.. మరో తమిళ చిత్రంలో భజ్జీ.. మోస్ట్ క్రేజీ రోల్‌లో.. బయోపిక్ కూడా..

క్రికెట్ మైదానంలో తన బౌలింగ్‌తో ప్రత్యర్థి ఆటగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన స్పిన్నర్ హర్బజన్ సింగ్ కొత్త అవతారం ఎత్తారు. కొద్ది రోజుల క్రితమే తమిళ చిత్రం ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించారు. అయితే తాజాగా మరో తమిళ చిత్రంలో కీలక పాత్రను పోషించనున్నారు. ఇప్పటికే యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా జాన్‌పాల్ రాజ్, షామ్ సురియా దర్వకత్వంలో ఫ్రెండ్‌షిప్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఫ్రెండ్‌షిప్ చిత్రంలో బిగ్‌బాస్ ఫేమ్ లోస్లియా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఫ్రెండ్‌ఫిప్ చిత్రం సెప్టెంబర్ రెండోవారంలో రిలీజ్ కానున్నది.

ఇక తాజాగా భజ్జీ డిక్కిలోనా చిత్రంలో నటించేందుకు అంగీకారం తెలిపారు. సంతానం హీరోగా తెరకెక్కుతున్న డిక్కిలోనా చిత్రం కామెడీ ప్రధానంగా రూపొందనున్నది. ఈ చిత్రంలో సర్వదేవ్ సింగ్ అనే పాత్రను ధరిస్తున్నాడు. ఈ చిత్రంలో హాకీ కోచ్‌గా హర్బజన్ సింగ్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో సంతానం త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఆ పాత్రలన్నీ పేర్లు కూడా మణి అని చిత్రయూనిట్ వెల్లడించింది.

 Cricketer harbhajan singh in Santhanams Dikkiloona movie

హర్బజన్ సింగ్ విషయానికి వస్తే.. తమిళ రాష్ట్రం, ప్రజలతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఐపీఎల్ టోర్ని కోసం భజ్జీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తమిళ సినీ ప్రముఖులు, క్రీడాకారులతో హర్బజన్‌కు ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది.

ఇదిలా ఉండగా, హర్భజన్ సింగ్ జీవితంపై బయోపిక్ రూపొందిస్తున్నారనే విషయం మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. ఈ సినిమాలో హర్బజన్ సింగ్ స్వయంగా తన పాత్రలో నటించనున్నారనే విషయంపై చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం భజ్జీ మాత్రం తన బయోపిక్‌పై సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. త్వరలోనే తన బయోపిక్‌పై ఆయన నిర్ణయం తీసుకోనున్నారని తెలిసింది.

 Cricketer harbhajan singh in Santhanams Dikkiloona movie

ఇటీవల మీడియాతో మాట్లాడుతూ... తన జీవితం ఆధారంగా బయోపిక్‌ రూపొందిస్తే అందులో తానే హీరోగా నటిస్తానని, తన పాత్రకు మరొకరు న్యాయం చేయలేరు. కాబట్టి నా నిజ జీవిత పాత్రకు తెర మీద తానే రూపం ఇస్తే బాగుంటుంది అని హర్భజన్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ వేరే ఎవరైనా చేయాల్సి వస్తే.. రణ్‌వీర్ సింగ్, కియారా అయితే బాగుంటుందని చెప్పారు.

ఫ్రెండ్‌షిప్ చిత్రంలో నటీనటులు, సాంకేతిక వర్గం
నటీనటులు: యాక్షన్ కింగ్ అర్జున్, హర్బజన్ సింగ్, లోస్లియా, ఆర్యన్ గౌడ్, మహేష్, అంకిరెడ్డి, జే సతీష్ కుమార్ తదితరులు
మాటలు: రాజశేఖర్ రెడ్డి
సంగీతం: డిఎం ఉదయ్ కుమార్
సినిమాటోగ్రఫీ: శాంత కుమార్
నిర్మాత: ఏఎన్ బాలాజీ
దర్శకత్వం: జాన్ పాల్ రాజ్ & శ్యామ్ సూర్య

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X