Friendship movie teaser: బంతి పట్టిన చేతితోనే కత్తి పట్టిన హర్భజన్ సింగ్.. అల్లరిమూకలను వేటాడుతూ..

క్రికెట్ రంగంలో రాణించిన స్పిన్పర్ హర్బజన్ సింగ్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. క్రికెట్ మైదానంలో తన బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన హర్బజన్ సింగ్ నటుడిగా జీవితాన్ని ప్రారంంచారు. ఫ్రెండ్‌షిప్ అనే సినిమా ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశిస్తున్నారు. జాన్ పాల్ రాజ్, షామ్ సూర్య కలిసి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో భజ్జీ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను జూలై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఆ ట్రైలర్ ఎలా ఉన్నందంటే..

యాక్షన్ కింగ్ అర్జున్ విలన్‌గా

యాక్షన్ కింగ్ అర్జున్ విలన్‌గా

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఫ్రెండ్‌షిప్‌ చిత్రంలో ఇంటెలిజెంట్ విలన్‌ పాత్రలో కనిపించనున్నారు. తాజా ట్రైలర్‌లో ఆయన ఇంటెన్సివ్ లుక్స్ ‌క్రేజీగా ఉన్నాయి. దాంతో ఈ సినిమా యాక్షన్‌తోపాటు సస్పెన్స్, థ్రిల్లర్‌గా రూపొందినట్టు స్పష్టమవుతున్నది.

యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా హర్బజన్ సింగ్

యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా హర్బజన్ సింగ్

ఇక కాలేజీ నేపథ్యంగా సాగుతున్నట్టు కనిపిస్తున్న ఫ్రెండ్‌షిప్ సినిమాలో క్రికెటర్ హర్బజన్ సింగ్ స్టూడెంట్‌గా, క్రికెటర్‌గా కనిపించబోతున్నారు. అంతేకాకుండా కాలేజ్ గ్యాంగ్ వార్‌లో యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా నటిస్తున్నారు. క్రికెట్ బాల్ పట్టిన చేతితోనే కత్తి చేతపట్టుకొని రౌడీ మూకలను తరిమి కొడుతున్న యువకుడిగా టీజర్‌లో కనిపించారు.

సంఘ విద్రోహ శక్తులకు ఎలా చెక్ అంటే

సంఘ విద్రోహ శక్తులకు ఎలా చెక్ అంటే

కాలేజ్ విద్యార్థుల జీవితంలో తమకు ఎదురైన సమస్యలపై హర్భజన్ సింగ్‌తో కూడిన బ్యాచ్ ఎలా స్పందించారు. సంఘ విద్రోహ శక్తుల చర్యలకు ఎలా చెక్ పెట్టారు. తమ జీవితంలో ఎదురైన సంఘటనలను కొందరు యువకులు ఎలా ఎదురించారనే థీమ్‌తో ఫ్రెండ్‌షిప్ సినిమాను రూపొందించినట్టు కనిపిస్తున్నది.

 ఫ్రెండ్ షిప్‌ డే సందర్భంగా టీజర్ రిలీజ్

ఫ్రెండ్ షిప్‌ డే సందర్భంగా టీజర్ రిలీజ్

ఆగస్టు 2వ తేదీన ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ఫ్రెండ్‌షిప్ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. యూత్‌కు నచ్చే అంశాలతో టీజర్‌ను రూపొందించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. హర్బజన్ సింగ్ ప్రధాన పాత్రలో కనిపిస్తున్నందున ఆయనపై ఉన్న సీన్లతో టీజర్‌ను రిలీజ్ చేయడం గమనార్హం.

Recommended Video

Dil Bechara Review | Sushant Singh Rajput | Sanjana Sanghi | AR Rahman
తమిళ ప్రజలతో ఏదో అనుబంధం

తమిళ ప్రజలతో ఏదో అనుబంధం

ఇటీవల తన సినీ రంగ ప్రవేశంపై హర్బజన్ మాట్లాడుతూ.. తమిళ ప్రజలతో నాకు ఎదో తెలియని అనుబంధం ఉంది. గతంలో ఐపీఎల్‌ భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడాను. తమిళ భాష రాకపోయినా కొంత మేరకు అర్ధం చేసుకోగలను. సినిమా షూటింగ్ సందర్బంగా సెట్లో నా కోసం ఓ అనువాదకుడిని ఏర్పాటు చేశారు. దాంతో చాలా సమస్యలు పరిష్కారం అయ్యాయి. తప్పకుండా ఫ్రెండ్‌షిప్ సినిమా అందరికీ నచ్చుతుంది అని హర్బజన్ సింగ్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X