twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్రికెటర్ శ్రీశాంత్‌తో హన్సిక.. ఆ రేంజ్‌లోనా.. తట్టుకోవడం కష్టమే?

    |

    దక్షిణాదిలో గత దశాబ్దకాలంగా గ్లామర్ తారగా రాణిస్తున్న హన్సిక మోత్వాని, వివాదాస్పద క్రికెటర్ శ్రీశాంత్ ఇద్దరు ఒక్కటవ్వబోతున్నారు. అయితే మీరనుకున్నట్టు కాదు. తెరపైన జంటగా కనిపించబోతున్నారు. గత కొద్ది రోజులు మీడియాలో నానుతున్న వార్తపై క్లారిటీ వచ్చింది. వీరిద్దరు కలిసి తమిళంలో ఓ హారర్ చిత్రంలో నటించబోతున్నారు. ఇంతకు ఈ సినిమా గురించి అసలు విషయమేమిటంటే..

    తమిళంలోకి శ్రీశాంత్

    తమిళంలోకి శ్రీశాంత్

    బెట్టింగ్ కూపంలో కూరుకుపోయి శ్రీశాంత్ క్రికెట్ రంగంలో నిషేధం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే నిషేధం నుంచి బయటపడుతూ మళ్లీ పాత వైభవాన్ని చేజిక్కించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా గత కొద్దికాలంగా శ్రీశాంత్ సినిమా రంగ ప్రవేశం గురించి వార్తలు వస్తున్నప్పటికీ కాంక్రీట్‌గా పెద్దగా డెవలప్‌మెంట్ జరుగలేదు. కానీ హిందీ సినిమాలో, అలాగే బిగ్‌బాస్‌తో ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి ప్రవేశించాడు.

    హన్సిక మోత్వాని హీరోయిన్‌గా

    హన్సిక మోత్వాని హీరోయిన్‌గా

    మలయాళం, తమిళ, తెలుగులో సినిమా మొదలు కాబోతున్నట్టు వార్తలు వచ్చినా అవి కార్యరూపం దాల్చలేదు. కానీ ఇప్పుడు మాత్రం శ్రీశాంత్ కల నిజమయ్యేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తమిళ హారర్ చిత్రం సెట్స్‌పైకి వెళ్లేందుకు రంగం సిద్ధమువుతున్నది. కాగా శ్రీశాంత్‌తో కలిసి నటించేందుకు గ్లామర్ బ్యూటీ హన్సిక మోత్వానీ పచ్చ జెండా ఊపినట్టు సమాచారం.

    త్వరలోనే అధికారికంగా

    త్వరలోనే అధికారికంగా

    ఇక తమిళ చిత్రం ద్వారా శ్రీశాంత్ తన సినీ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. దర్శకులు హరిశంకర్, హరీష్ నారాయణ్ జంటగా దర్వకత్వం వహించబోతున్నారు. రంగనాథన్ అనే నిర్మాత ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమా వివరాలను అధికారికంగా త్వరలోనే వెల్లడిస్తారు.

    3డీ హారర్ చిత్రంగా

    3డీ హారర్ చిత్రంగా

    అయితే ఈ చిత్రం అత్యాధునిక టెక్నాలజీతో 3డీ హారర్‌గా రూపొందించే పనిలో ఉన్నారు. ప్రతీక్షణం ప్రేక్షకుడిని కొత్త అనుభూతికి గురిచేసే విధంగా సినిమాను తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతున్నది. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్‌ను కూడా ఉపయోగించుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం స్క్రిప్టు దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుతున్నట్టు సమాచారం.

    2007లో టాలీవుడ్ చిత్రం

    2007లో టాలీవుడ్ చిత్రం

    ఇక హన్సిక విషయానికి వస్తే 2007లో టాలీవుడ్ చిత్రం దేశముదురుతో సినీ కెరీర్‌ను ప్రారంభించింది. అల్లు అర్జున్ జతకట్టగా పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అదే ఏడాది హిందీలో హిమేష్ రేషమ్మియాతో కలిసి ఆప్ కా సురూర్ చిత్రంలో నటించింది. దక్షిణాదిలో అద్భుతమైన చిత్రాల్లో నటించి అగ్రతారగా రాణిస్తున్న విషయం విదితమే.

    English summary
    Cricketer Sreesanth to joins with Hansika Motwani for Tamil horror. Hari Shankar and Hareesh Narayan are the directors. produced by Ranganathan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X