twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ధనుష్ తండ్రి కోసం కేసులో ఇరుక్కున్న రజనీకాంత్.. ఏం జరిగిందంటే!

    |

    సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 2.0 చిత్రం థియేటర్స్ లో సందడి చేస్తోంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి వసూళ్లనే రాబడుతోంది. మరోవైపు రజని పెట్ట చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన పెట్ట చిత్ర టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉండగా రజనీకాంత్ ఓ కేసు విషయంలో వార్తల్లో నిలిచారు. తన వియ్యంకుడి అప్పుకు హమీదారుడిగా ఉన్న రజని మెడకు సివిల్ కేసు చుట్టుకుంది.

    65 లక్షల అప్పు

    65 లక్షల అప్పు

    సూపర్ స్టార్ రజనీకాంత్ వియ్యంకుడు కస్తూరి రాజా కొంతకాలం క్రితం ముకుచంద్ బోత్రా అనే ఫైనాన్సియర్ వద్ద 65 లక్షల అప్పు తీసుకున్నట్లు తెలుస్తోంది. తన వియ్యంకుడి అప్పుకు రజని హమీదారుడిగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల బోత్రా తన అప్పు చెల్లించలేదని కోర్టుకు ఎక్కాడు. కస్తూరి రాజా కుమారుడు ధనుష్ రజనికి అల్లుడైన సంగతి తెలిసిందే.

     రజని దూషించాడు అంటూ

    రజని దూషించాడు అంటూ

    ఈ వివాదంలో రజనీకాంత్ తనని దూషించాడు అంటూ బోత్రా పరువునష్టం దావా వేశాడు. దీనిపై విచారణ జరిగిపిన న్యాయస్థానం రజనికి ఊరట కల్పించింది. రజనీకాంత్ ఆ అప్పుని తీర్చేసినట్లు తేలింది. రజనీకాంత్ తో వివాదం పెట్టుకుని పబ్లిసిటీ పొందాలని భావించిన బోత్రాకు చురకలు అంటిస్తూ.. రజినీపై నమోదు చేసిన కేసుని కొట్టివేసింది.

     రాజకీయాల్లోకి

    రాజకీయాల్లోకి

    సూపర్ స్టార్ రజని ఆ మధ్యన రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించిన అనంతరం దేశవ్యాప్తంగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. రజని గురించి ఏ విషయం బయటకు వచ్చినా అది జాతీయ న్యూస్ గా మారిపోతోంది. రజనీకాంత్ పార్టీని ఎప్పుడు ప్రకటిస్తారా అని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. తన అభిమాన సంఘాలతో చర్చించిన తరువాతే రజనీకాంత్ రాజకీయాల్లోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.

    వరుస చిత్రాలతో

    వరుస చిత్రాలతో

    రజనీకాంత్ ఈ వయసులో కూడా వరుస చిత్రాలతో బిజీగా గడుపుతున్నాడు. త్వరలో కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన పెట్ట చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం తరువాత రజని క్రేజీ దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించబోయే చిత్రంలో నటించేందుకు సిద్ధం అవుతున్నారు. పొలిటికల్ నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతోందనే వార్తలని మురుగదాస్ కొట్టిపారేశాడు.

    English summary
    Criminal defamation proceedings against Rajinikanth quashed by Madras HC. The court earlier dismissed a civil suit filed by the financier against Rajinikanth
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X