twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మండిపడుతున్నాడు: రివ్యూ రైటర్లు..శాడిస్టులు, సైకోలు

    By Srikanya
    |

    చెన్నై : రివ్యూలు బాగుంటే..మెచ్చుకున్నా లేకపోయినా...బాగా రాయకపోతే మాత్రం మండిపడటం మాత్రం కామన్ అయిపోయింది. రీసెంట్ గా టాలీవుడ్ లోనూ మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు తమిళంలోనూ వడివేలు తో పుంజుకుంది. వడివేలు.. తన తాజా చిత్రం ఎలిపై సరైన రివ్యూలు రాలేదని మండిపడుతున్నాడు.

    వడివేలు మాట్లాడుతూ...ఎలి సినిమాకు సంభందించి ఎన్ని కష్టాలు పడ్డామో మాకు తెలుసు. విడుదలకు ముందు కూడా ఇబ్బందులు తలెత్తాయి. వాటిన్నటినీ అధిగమించి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చాం. సినిమా జనాలకే బాగానే నచ్చింది. చాలా మంది పాజిటివ్ రివ్యూలు రాసారు. కానీ కొంతమందికి ఏమైందో తెలియదు. చాలా నెగిటివ్ గా రాసారు. వాళ్ల వెనక ఎవరో ఉన్నారు. బహుసా వాళ్లను ఏమైనా ఎలుక(ఎలి) కరిచిందేమో. ఇలాంటి రివ్యాలు రాసిన వాళ్లు సైకోలు, శాడిస్టులు అన్నారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    Critics are psychos and sadists: Vadivelu

    వడివేలు హీరోగా నటించిన నాలుగో చిత్రం ‘ఎలి' గత వారంలో విడుదలై డివైడ్‌ టాక్‌ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఏదైతే బలమని నమ్మారో అదే బెడిసికొట్టడంతో ‘ఎలి' ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. వడివేలు రీఎంట్రీ చిత్రం ‘తెనాలిరామన్‌'ను తెరకెక్కించిన యువరాజ్‌ దయాళనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

    1960ల నేపథ్యంతో తెరకెక్కించిన ఈ చిత్రంలో కామెడీ వర్కవుట్‌ కాకపోవడంతో సామాజిక మాధ్యమంలో ‘ఎలి'పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇది వడివేలుకి నచ్చలేదు. ఓ ఇంటర్వ్యూలో విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని అడ్డుకునేందుకు పలువురు ప్రయత్నించారని, ఎన్నో క్లిష్ట పరిస్థితులను దాటుకుని ‘ఎలి' విడుదలైందని వడివేలు చెప్పారు.

    మా కష్టాన్ని ఎందరో అభినందించి సినిమా ఆస్వాదిస్తుంటే, కొంతమంది విమర్శకులు కావాలనే ‘ఎలి'పై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సిగరెట్‌ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదన్న మంచి సందేశాన్ని ఈ చిత్రంలో చూపించామని, ప్రజలందరూ తప్పకుండా ‘ఎలి'ని చూడాలని ఈ సందర్భంగా వడివేలు ప్రజల్ని కోరారు.

    కైపుల్ల, వకీల్‌ వండు మురుగన్‌, స్నేక్‌బాబు, నాయ్‌ శేఖర్‌... ఇలా ఎన్నిరకాలుగా పిలిచినా వడివేలు పలుకుతారు. వెండితెరపై ఆయన పండించిన హాస్యం మాత్రమే కాకుండా పోషించిన పాత్రలు కూడా ప్రేక్షకుల మదిలో నాటుకుపోయాయి. ఈ చిత్రం సందర్భంగా వడివేలు మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లోకి వస్తే రావొచ్చు మన చేతిలో ఏముంది. అంతా భగవంతుడి పనే. జీవితంలో ఏం జరుగుతుందని లెక్కగట్టగలమా?. అయితే ప్రస్తుతానికి రాజకీయాలనే ఆ దుకాణాన్ని మూసివేశా. ఇప్పుడు హాస్యానికే స్వాగతం పలుకుతున్నారు.

    English summary
    Star comedian Vadivelu said that while top publications and websites have given positive reviews for Eli, some of them have given a bad review of the film without even watching the movie. He went on to call the reviewers who have given a bad review as psychos and sadists.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X