కస్టడీ దర్శకుడికి లక్కీ ఛాన్స్.. అంత పెద్ద డిజాస్టర్ వచ్చినా, అగ్ర హీరో గ్రీన్ సిగ్నల్

నాగ చైతన్య కస్టడీ సినిమాతో తమిళ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. ఈ మూవీ కోసం మంచి స్టొరీ లైన్ తీసుకున్నా కూడా స్క్రీన్ ప్లేలో లోపల కారణంగా సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు. ఓ విధంగా చెప్పాలంటే డిజాస్టర్ టాక్ వచ్చింది. ఈ మూవీతో నాగ చైతన్య కెరియర్ లో హ్యాట్రిక్ ఫ్లాప్ ని ఖాతాలో వేసుకున్నారు.

వెంకట్ ప్రభు చివరిగా తమిళంలో మానాడు మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. శింబు, ఎస్ జె సూర్య కాంబినేషన్ లో టైమ్ లూప్ పాయింట్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకి భాగా కనెక్ట్ అయ్యింది. ఇలా డిఫరెంట్ కథలని, అంతే డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఆవిష్కరిస్తాడు అని వెంకట్ ప్రభుకి మంచి పేరుంది. అయితే కస్టడీ విషయంలో ఎందుకనో అతని మ్యాజిక్ వర్క్ అవుట్ కాలేదు.

Custody movie director venkat prabhu lucky chance with kollywood star hero

అయిన కూడా ఇప్పుడు ఈ దర్శకుడు క్రేజీ ఆఫర్ ని సొంతం చేసుకున్నాడు. ఇళయదళపతి విజయ్ ఇప్పుడు వెంకట్ ప్రభుతో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంట. ప్రస్తుతం విజయ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో సినిమా చేసే అవకాశం ఉంది.

అయితే ఇప్పుడు వెంకట్ ప్రభు చెప్పిన కథకి విజయ్ ఒకే చెప్పాడనే మాట కోలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది. లియో తర్వాత ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందనే టాక్ తెరపైకి వచ్చింది. కస్టడీ మూవీతో బిగ్గెస్ట్ డిజాస్టర్ ని ఖాతాలో వేసుకున్న కూడా ఏకంగా స్టార్ హీరో విజయ్ వెంకట్ ప్రభుకి అవకాశం ఇవ్వడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి.

అయితే వెంకట్ ప్రభు కస్టడీ ఫెయిల్యూర్ కి వంద కారణాలు ఉండొచ్చు. కాని అతని డైరెక్టర్ టాలెంట్, మేకింగ్ విజన్ ని తక్కువ అంచనా వేయలేం. కోలీవుడ్ హీరోలు అందరికి కూడా వెంకట్ ప్రభు కెపాసిటీ తెలుసు. ఈ నేపథ్యంలోనే అతనికి విజయ్ ఛాన్స్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X