దగ్గుపాటి రాణా కొత్త సినిమా...కొత్త అవతారం...!
రాణా కొత్త పేరు రెడ్డప్ప! లేటెస్ట్ గా తన పేరును ఇలా మార్చుకున్నాడనుకుంటున్నారా ...కాదులెండి... ఇది త్వరలో తాను చేయబోయే పాత్ర పేరు. గాయం, వేదం చిత్రాల దర్శకుడు క్రిష్ తాజాగా, రాణా కథానాయకుడుగా 'కృష్ణం వందే జగద్గురుం' పేరుతో ఓ సినిమా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో రాణా రెడ్డప్పగా ఓ మాఫియా డాన్ పాత్రను పోషిస్తున్నాడట. ఈ చిత్రం షూటింగు ఈ నెల 14 న హైదరాబాదులో లాంచనంగా ప్రారంభమవుతున్నట్టు రానా చెబుతున్నాడు. ఇందులో కథానాయికగా అనుష్కను ఎంపిక చేసినప్పటికీ అధికారికంగా మాత్రం ఇంకా ఆమె పేరును ప్రకటించలేదు.
ఇదిలా ఉంచితే, లీడర్ తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రాణా ఇటు టాలీవుడ్ లోనూ, అటు బాలీవుడ్ చిత్రాలలోనూ నటించి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు కోలీవుడ్ లోనూ పాగా వేయబోతున్నాడు. రాణా తమిళంలో 'వడ వడ చెన్నై' అనే చిత్రంలో నటిస్తున్నాడు. వెట్రిమారన్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ధయాలనగిరి నిర్మాత దీంతో అనతికాలంలోనే మూడు భాషల్లో నటించిన ఘనతను రాణా పొందుతున్నాడు.


Click it and Unblock the Notifications











