మరో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'డమాల్‌ డుమీల్‌'

By Srikanya

Damaal Dumeel is story Of crime and comedy
చెన్నై : ఈ మధ్య కాలంలో సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా వచ్చిన చిత్రాలన్నీ తమిళ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. పిజ్జా, విల్లా, సుట్టకథై తదితర సినిమాలు ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకుల మన్ననలు అందుకున్నాయి. ఆ క్రమంలో మరో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. అదే 'డమాల్‌ డుమీల్‌'.

చిత్ర దర్శకుడు శ్రీ మాట్లాడుతూ.. '' మా చిత్రం హాస్యంతో కూడిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌. యువకుడై వైభవ్‌ అనుకోకుండా తన ఉద్యోగాన్ని కోల్పోతాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించే క్రమంలో సంఘ విద్రోహులైన కోటా శ్రీనివాసరావు, షాయాజీ షిండే వద్ద చిక్కుకుంటాడు. బయటపడాలని ప్రయత్నిస్తే ప్రాణానికే ప్రమాదం నెలకొంటుంది. ఈ సమస్యల నుంచి వైభవ్‌ ఎలా తప్పించుకున్నాడనేదే కథ. సినిమా మొత్తం తుపాకీ శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయి. అందుకే టైటిల్‌ను 'డమాల్‌ డుమీల్‌' పెట్టాం. తమన్‌ చక్కని సంగీతాన్ని అందించారు. రమ్యా నంబీశన్‌ కూడా ఓ పాట పాడారు. ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది''అని ధీమా వ్యక్తం చేశారు.

వైభవ్‌-రమ్యా నంబీశన్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కోటా శ్రీనివాసరావు, షాయాజీ షిండే, చార్లీ, మనోబాలా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కేమియో ఫిలింస్‌ తరఫున రాజ్‌కుమార్‌ నిర్మిస్తున్నారు. సంగీతం తమన్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X