'దమ్ము' తమిళ వెర్షన్ విడుదల ఆగింది
ఎన్టీఆర్, కార్తీక,త్రిష కాంబినేషన్ లో రూపొందిన దమ్ము చిత్రం తమిళ వెర్షన్ ని మే 4,2012 న విడుదల చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. సింగ మగన్ టైటిల్ తో డబ్బింగ్ అయిన ఈ చిత్రం మొన్న శుక్రవారం విడుదల కాలేదు. దానికి కారణం సెన్సార్ కాకపోవటమే అని చెప్తున్నారు. అయితే తెలుగు వెర్షన్ కి డివైడ్ టాక్ రావటంతో ఆగారని ఓ వర్గం అంటోంది. అయితే త్వరలోనే తమిళ వెర్షన్ ని విడుదల చేస్తామని నిర్మాతలు చెప్తున్నారు. ఇక డైరక్ట్ గా తెలుగు వెర్షన్ ని తమిళంలో రిలీజ్ చేసి వదిలారు. మొన్న శుక్రవారం వరకూ చెన్నైలో దమ్ము సెకండ్ ప్లేస్ లో ఉందని ట్రేడ్ లో వార్తలు వచ్చాయి. మొదటి ప్లేస్ లో ఎవేంజర్స్ చిత్రం ఉందని చెప్పారు.
తెలుగు సినిమాలను నేరుగా తెలుగులో తమిళనాట 25 స్క్రీన్లలో రిలీజ్ చేయడం ఇటీవల కాలంలో పోలిస్తే రికార్డే స్థాయి అని చెప్పుచ్చు. తమిళంలో డబ్బింగ్ చేసి విడుదల చేస్తే ఇది చిన్న సంఖ్యే. కానీ 'దమ్ము' చిత్రం తమిళంలో డబ్ చేయకపోవటంతో రికార్డుగా క్రియేట్ అయ్యింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎన్టీయార్ కు జోడీగా త్రిష, కార్తీక నటించారు. సీనియర్ నిర్మాత కె.యస్. రామారావు తనయుడు అలెగ్జాండర్ వల్లభ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎక్కువ సెంటర్లలో రిలీజ్ చేయటంతో పాత రికార్డుల్నిఆ సినిమాలు అతి తక్కువ సమయంలోనే క్రాస్ చేస్తున్నాయి.
ఇక దమ్ము చిత్రం ప్రారంభం రోజు టాక్ యావరేజ్, క్లైమాక్స్ వీక్ అని వచ్చినా కలెక్షన్స్ మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. ఈ వీకెండ్ అనంతరం వచ్చే సోమవారం కలెక్షన్స్ ని బట్టి చిత్రం స్దాయిని అంచనా వేస్తారు. ఎందుకంటే మొదటి వారం కేవంల అబిమానులు ఏ సినిమానైనా చూస్తూంటారు. టాక్ ని బట్టి ఫ్యామిలీలు కదిలేది వారం తర్వాతే కాబట్టి ట్రేడ్ లో లెక్కలు అలా వేస్తారు. ఇక బోయపాటి శ్రీను సైతం ఈ చిత్రం కలెక్షన్స్ పై ధీమాగా ఉన్నాడు. మీడియాతో ఓ రేంజిలో పబ్లిసిటీ చేస్తున్నారు. అన్ని ఛానెల్స్ లోనూ బోయపాటి శ్రీను ఇంటర్వూలు ఇస్తూ ఈ సినిమాకు మరింత క్రేజ్ తెచ్చే పనిలో ఉన్నాడు.
తమిళ దమ్ము వెర్షన్ కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంటుందని భావిస్తున్నారు. అక్కడి మార్కెట్ కి అణుగుణంగా త్రిష,కార్తీకని పెట్టడం కూడా స్టాటజీలో భాగమే అంటున్నారు. త్రిష,కార్తీక ఇద్దరూ తమిళంలో సేలబుల్ స్టార్స్ కావటం కలిసివచ్చే అంశమని అంటున్నారు. కార్తీక అక్కడ నటించిన రంగం చిత్రం ఘన విజయం సాధించింది. అలాగే అక్కడ పెద్ద స్టార్స్ అందరితోనూ త్రిష నటించి హిట్స్ సాధించింది. అలాగే విలన్ గా చేసిన నాజర్,తాతగా వేసిన కోట శ్రీనివాసరావు కూడా అక్కడ ప్రేక్షకులకు సుపరిచమే కాబట్టి ఈ సినిమా అక్కడి ప్రేక్షకులకు నచ్చే అవకాశం ఉందని ట్రేడ్ లో అంటున్నారు. అక్కడ శాటిలైట్ రైట్స్ సైతం బాగా వస్తాయంటున్నారు.


Click it and Unblock the Notifications











