స్టార్ తెలుగు డాన్స్ మాస్టర్ కన్నుమూత

రఘురామ్ మాస్టర్ గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. రజనీకాంత్, కమల్‌హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ హీరోల చిత్రాలకు పని చేసిన రఘురామ్... తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ తదితర భాషల్లో 1000కిపైగా పాటలకు నృత్యరీతులు సమకూర్చారు.
కమల్‌హాసన్ హీరోగా తెరకెక్కిన 'సాగర సంగమం', 'పున్నగైమన్నన్' (డాన్స్‌మాస్టర్), 'పీపుల్స్ ఎన్‌కౌంటర్' తదితర చిత్రాల్లో ఆయన సమకూర్చిన నృత్యాలకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభించాయి. 'దశావతారం'లో రఘురామ్ నటుడిగానూ కనిపించి అలరించారు. గత ఏడాదితో నృత్య దర్శకుడిగా 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు.
ప్రముఖ నృత్య దర్శకురాలు గిరిజను రఘురామ్ మాస్టర్ వివాహమాడారు. వీరి కుమార్తె గాయత్రి నటిగా, నృత్య దర్శకురాలిగా కొనసాగుతున్నారు. రఘురామ్ పార్థివదేహానికి ప్రముఖ నటులు రజనీకాంత్ నివాళులుఅర్పించారు. రఘురామ్ అంత్యక్రియలను ఆదివారం నిర్వహించనున్నారు.


Click it and Unblock the Notifications











