శివశంకర్ డ్యాన్స్ మాస్టర్ ఆరోగ్యం విషమం.. ఆపస్మారక స్థితి పెద్దకొడుకు.. కోవిడ్‌తో వెంటాడుతున్న విషాదం

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కు కరోనా సోకి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. కోవిడ్ బారిన పడటంతో గత నాలుగు రోజులుగా ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్‌ఫెక్షన్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దాంతో ఆయన ఆరోగ్యంపై స్నేహితులు, సన్నిహితులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Dance Master Sivasankar health condition is very critical

శివ శంకర్ మాస్టర్ కుటుంబం మొత్తం కరోనావైరస్ కారణంగా తీవ్రమైన సమస్యల్లో కూరుకుపోయారు. ఆయన పెద్ద కుమారుడు కూడా కరోనా సోకి అపస్మారక స్థితిలో ఉన్నారు. శివ శంకర్ మాస్టర్ భార్య కరోనాతో హోమ్ క్వారెంటైన్ లో ఉన్నారు. చిన్నకొడుకు అజయ్ కృష్ణ ఒక్కడే ప్రస్తుతం తండ్రి, అన్న, అమ్మ బాగోగులు చూసుకుంటున్నారు.

శివ శంకర్ మాస్టర్‌కు భారీగా ఖర్చు‌తో అవసరం కావడంతో చికిత్స అందించడం కష్టమవుతోంది. రోజుకు లక్షల రూపాయలు వైద్య ఖర్చుల నిమిత్తం ఖర్చు అవుతోంది. ఎన్నో గొప్ప పాటలకు నృత్యాలను సమకూర్చి, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన శివ శంకర్ మాస్టర్‌కు ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరం. ఆయన త్వరగా కోలుకోవాలి అని ప్రతీ ఒక్కరు కోరుకొంటున్నారు.

శివ శంకర్ మాస్టర్ దాదాపు 10 భాషల్లో పనిచేశారు. ముఖ్యంగా దక్షిణాదిలో తమిళ్, తెలుగు భాషల్లో ఎక్కువగా పనిచేశారు. తెలుగులో ఖైదీ, అమ్మోరు, సూర్యవంశం, తిరుడా తిరుడి, అల్లరి పిడుగు, మగధీర, మహాత్మ, బాహుబలి: ది బిగినింగ్ చిత్రాలకు పనిచేశారు.

నటుడిగా కూడా చాలా సినిమాల్లో నటించారు. పాప్‌కార్న్, గాడ్ ఫదర్, పరదేశి, నేనే రాజు, నేనే మంత్రి, సర్కార్, అక్షర, ఎన్టీఆర్ కథానాయకుడు, నిను వీడని నీడను నేను, రాజుగారి గది 3 చిత్రాల్లో నటించారు.

బుల్లితెరపై ఓంకార్ హోస్ట్‌గా వ్యవహరించిన ఆట డ్యాన్స్ రియాలిటీ షో హోస్ట్‌గా కూడా వ్యవహరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X