విశ్వాసం సెట్‌లో విషాదం.. మానవత్వాన్ని చాటిన అజిత్, ప్రత్యేక విమానంలో.. 3 గంటలు అక్కడే!

Recommended Video

Ajith Helps Viswasam's Movie Dancer

తమిళ స్టార్ హీరో అజిత్ వరుసగా దర్శకుడు శివతో సినిమాలు చేస్తున్నాడు. శివ అజిత్ కాంబినేషన్ ఇప్పటి వరకు మూడు చిత్రాలు వచ్చాయి. దీనితో విశ్వాసం చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అజిత్ ని అభిమానులు మెచ్చేలా చూపించడంలో శివ ఆరితేరిపోయాడు. అందుకే వీరిద్దరి కాంబినేషన్ మంచి సక్సెస్ సాధిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పుణేలో షూటింగ్ చేస్తున్న సమయంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది.

దాదాపుగా పూర్తి

దాదాపుగా పూర్తి

విశ్వాసం షూటింగ్ మొత్తం దాదాపుగా పూర్తయింది. టాకీ పార్టీ మొత్తం పూర్తి కావడంతో దర్శకుడు ప్రస్తుతం సాంగ్స్ చిత్రీకరిస్తున్నారు. ఓ సాంగ్ చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ పూణేకు వెళ్లినట్లు తెలుస్తోంది. కానీ అక్కడ అనుకోకుండా జరిగిన సంఘటనతో చిత్ర యూనిట్ మొత్తం దిగ్బ్రాంతిలో మునిగిపోయారు.

డాన్సర్ మృతి

డాన్సర్ మృతి

శరవణన్ అనే 42 ఏళ్ల వ్యక్తి సాంగ్ లో డాన్సర్ గా పనిచేస్తున్నాడు. షూటింగ్ జరుగుతుండగా శరవణన్ అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నాడు. దీనితో చిత్ర యూనిట్ అతడికి విశ్రాంతి కల్పించింది. కానీ శరవణన్ పరిస్థితి విషమించడంతో వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తూ శరవణన్ గుండె పోటుతో మరణించాడు.

 మానవత్వం చాటుకున్న అజిత్

మానవత్వం చాటుకున్న అజిత్

శరవణన్ కు అవసరమైన వైద్య ఖర్చులన్నీ అజిత్ భరించినట్లు తెలుస్తోంది. చిత్ర యూనిట్ తో పాటు అజిత్ మూడు గంటల సమయంలో ఆసుపత్రిలోనే గడిపాడట. కానీ శరవణన్ మరణించడంతో అజిత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. చిత్ర యూనిట్ మొత్తం షాక్ కి గురయ్యారు.

ప్రత్యేక విమానం

ప్రత్యేక విమానం

శరవణన్ మృతదేహాన్ని అతడి నివాసానికి చేర్చే బాధ్యత కూడా అజిత్ తీసుకున్నాడట. ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి మృత దేహాన్ని చెన్నై తరలించినట్లు తెలుస్తోంది. శరవణన్ కుటుంబ సభ్యులకు అజిత్ ఆర్థికంగా కూడా సాయం చేయబోతున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X